Telangana Elections: ఇదేనా 80వేల పుస్తకాలు చదివిన జ్ఞానం.. అభ్యర్థుల లిస్ట్‌పై మాటల మంటలు!

సీఎం కేసీఆర్‌ టార్గెట్‌గా కాంగ్రెస్‌, బీజేపీ, కమ్యూనిస్టులు, YSRTP.. ఇలా అన్ని పార్టీల నేతలు ఫైర్ అయ్యారు. అభద్రత భావంతోనే రెండు చోట్ల పోటీకి కేసిఆర్ సిద్ధమయ్యారని బీజేపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కామెంట్స్‌ చేయగా.. కేసీఆర్‌ అహంకారం నవంబర్‌లో పోతుందంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌చుగ్‌ విమర్శలు గుప్పించారు. 2014 కంటే ముందు జరిగిన ప్రతీ పాపంలో నువ్వు(కేసీఆర్‌) ప్రత్యక్ష భాగస్వామివంటూ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.

New Update
Telangana Elections: ఇదేనా 80వేల పుస్తకాలు చదివిన జ్ఞానం.. అభ్యర్థుల లిస్ట్‌పై మాటల మంటలు!

అందరికంటే ముందుగా అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్‌, బీజేపీ నేతలు విమర్శల దాడి మొదలుపెట్టారు. అటు కమ్యూనిస్టులు సైతం రంగంలోకి దిగి మాటలకు పదును పెట్టారు.

ఎవరు ఏమన్నారంటే:

రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు:

• కాంగ్రెస్ సవాల్‌ను కేసీఆర్ స్వీకరించకుండా ఓటమిని ఒప్పుకున్నారు.

• 12.03 గంటలకు బీఆరెస్ అభ్యర్థుల లిస్ట్ విడుదల అని ప్రచారం చేసుకున్నారు.

• కానీ ఆ ముహూర్తంలో లిక్కర్ షాప్స్ డ్రా తీశారు..

• కేసీఆర్ ప్రాధాన్యత ఏంటో తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి.

• కేసీఆర్ విడుదల చేసిన లిస్ట్ చూసిన తర్వాత రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ పార్టీనే అని అర్థమైంది

• 2/3 మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.

• కేసీఆర్ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారంటే ఆయన స్వయంగా తన ఓటమిని ఒప్పుకున్నట్లే..

• కేసీఆర్‌ను ఆ రెండు నియోజకవర్గాల్లో ప్రజలు ఓడిస్తారు.

• కేసీఆర్ పారిపోవాలనుకుంటే సిద్దిపేట ఉంది.. సిరిసిల్ల ఉంది..

• కానీ ఒక మైనారిటీ నేత ఉన్న కామారెడ్డికి వెళ్లడం ... మైనారిటీలను అవమానించడమే

• ఈ విషయాన్ని మైనారిటీలు నిశితంగా గమనిస్తున్నారు.

• రెండు చోట్ల కేసీఆర్ పోటీ చేస్తున్నారంటే.. ఆయన గొంతులో భయం మొదలైంది.

• 50ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసింది అని కేసీఆర్ అంటున్నారు

• నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టులు మీ తాతలు కట్టారా?

• 12,500 గ్రామ పంచాయతీలు ఉన్నాయని కేసీఆర్ అన్నారు.. ఆ గ్రామాలకు కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ కాదా?

• నీ చింతమడకలో బడి కట్టింది.. నీ ఇంటికి కరెంటు ఇచ్చింది కాంగ్రెస్..

• ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో నిర్మించింది కాంగ్రెస్..

• జనసంద్రత ఉన్న జూబ్లీ బస్‌స్టేషన్, కాచిగూడ, గౌలీగూడా లాంటి చోట్ల కాంగ్రెస్ మెట్రో రైలు వేసింది

• భూముల విలువ పెంచుకునేందుకు ఔటర్ చుట్టూ కేసీఆర్ మెట్రో వేస్తున్నారు.

• పేదలకు ఉపయోగపడేలా కాంగ్రెస్ మెట్రో వేస్తే.. రియల్ ఎస్టెట్‌ వ్యాపారం కోసం మీరు మెట్రో వేస్తున్నారు.

• కాంగ్రెస్ ఏం చేసింది అని సిగ్గు లేకుండా అడుగుతున్నవా?

• ఇదేనా 80వేల పుస్తకాలు చదివిన నీ జ్ఞానం..

• 2014 కంటే ముందు జరిగిన ప్రతీ పాపంలో నువ్వు ప్రత్యక్ష భాగస్వామివి..

• ఆ పాపాలకు కారణమైన నువ్వే పాపాల భైరవుడివి.

• 2004లో కాంగ్రెస్‌తో, 2009లో టీడీపీతో, 2011లో బీజేపీ తో పొత్తు పెట్టుకుంది నువ్వు కాదా?

• కేసీఆర్‌కు నేను సూటిగా సవాల్ విసురుతున్నా.. 50 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందో లెక్కలతో సహా చర్చకు సిద్ధం

• 23లక్షల కోట్లతో తెలంగాణలో నువ్వు చేసిన అభివృద్ధి ఏందో చర్చిద్దాం..

• పెన్షన్ మొదలు పెట్టిందే కాంగ్రెస్.. రుణమాఫీ చేసి రైతులను ఆదుకుంది కాంగ్రెస్..

• నిర్దిష్టమైన చర్చ జరిగేందుకు కేసీఆర్ ముందుకు రావాలి..

• మూడు పంటలు అంటున్న కేసీఆర్ రైతు బంధు రెండు పంటలకే ఎందుకు వేస్తున్నారు?

• కేసీఆర్ తన తల్లిదండ్రుల పేర్లు తప్ప... ఏదీ నిజం చెప్పరు..

• మేం రూ.4000 పెన్షన్ ఇచ్చి తీరతాం..

• ఐఆర్బీ నుంచి వచ్చిన సొమ్ముతో పెట్టుబడి పెట్టేందుకు కేటీఆర్ అమెరికా వెళ్లారు.

• వరద బాధితులను పరామర్శించేందుకు కేటీఆర్ ఎందుకు వెళ్లలేదు?

• కేటీఆర్ సవాల్‌ను స్వీకరిస్తున్నాం. యాదగిరిగుట్టలో ప్రమాణం చేద్దామా.. నాంపల్లి దర్గా వద్ద ప్రమాణం చేద్దామా?

• మందు.. డబ్బు పంచకుండా ప్రజలను ఓట్లు అడిగేందుకు కేసీఆర్ సిద్ధమా..

• నిన్న సూర్యాపేట సభలో శ్రీకాంత చారి తల్లిని నిలబెట్టి అవమానించారు.

• అమరవీరుల కుటుంబానికి కనీస గౌరవం ఇవ్వలేదు.

• మహిళా రిజర్వేషన్ కోసం కవిత ఢిల్లీలో ధర్నా చేయడం కాదు.. ఇక్కడ కేసీఆర్‌ను ప్రశ్నించాలి.

• నమ్మించి మోసం చేసిన కేసీఆర్‌పై కమ్యూనిస్టులు పోరాటం చేయాలి


జూలకంటి కామెంట్స్

మిర్యాలగూడ సీపీఎం కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కేసీఆర్‌ టార్గెట్‌గా ఫైర్ అయ్యారు. మునుగోడు ఎన్నికల్లో కమ్యూనిస్టుల అవసరం ఉందని కేసీఆర్ వామపక్షాల సహాయం తీసుకున్నారని.. అవసరం తీరిన తర్వాత ఇన్నాళ్లు మభ్యపెడుతూ మొండిచేయి చూపించారన్నారు. కేసీఆర్‌ వామపక్షాలను విస్మరించడం సరికాదన్నారు. వామపక్షాలతో కలిసి ఉంటామని చెప్పిన కేసీఆర్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించడం అతని అవకాశవాదానికి నిదర్శనమని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీరును ప్రజలు గమనిస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారన్నారు. కేసీఆర్‌ చేసిన మోసానికి వామపక్ష పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరు నిరుత్సాహ పడవద్దన్నారు. అవకాశవాద పార్టీలను వచ్చే ఎన్నికల్లో ఓడించి బుద్ధి చెప్పాలని కోరారు.

అటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌చుగ్‌ కేసీఆర్‌పై మండిపడ్డారు. కేసీఆర్‌ అహంకారం నవంబర్‌లో పోతుందని జోస్యం చెప్పారు. బీజేపీ వానర సేన కేసీఆర్ లంకను దహనం చేస్తుందన్నారు. తెలంగాణలో బీజేపీ ముఖ్యమంత్రి ఉంటాడని.. అవినీతి, కుటుంబ, నియంతృత్వ పాలనకు తెలంగాణ ప్రజలు ముక్తి కోరుకుంటారన్నారు. ప్రభుత్వ వాహనంలో బాలికపై అత్యాచారం జరిగిన పట్టించుకోరన్నారు.

డీకే అరుణ, బీజేపి జాతీయ ఉపాధ్యక్షురాలు

• అభద్రత భావంతోనే రెండు చోట్ల పోటీకి సిద్ధమైన కేసిఆర్.

• ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రోజుకో ప్రకటన చేస్తున్న కేసిఆర్

• కేసిఆర్ మోసాలపై ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది

• కేంద్ర పథకాలపై గ్రామ గ్రామాన అవగాహన తేవాలి

• కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండు బీజేపీని టార్గెట్ చేస్తూ ప్లాన్‌గా ముందుకి వెళ్తున్నాయి.

• కేసీఆర్ అవినీతిని ఎండగట్టాలి

• నిర్మల్ మాస్టర్ ప్లాన్‌ను వ్యతిరేకించిన మహేశ్వర రెడ్డిపై లాఠీ చార్జి చేసి దుర్మార్గంగా వ్యవహరించారు.

• పరామర్శించేందుకు వెళ్తున్న నన్ను అరెస్ట్ చేశారు

• ఎన్నికలకు మూడు నెలల సమయం కూడా లేదు

అందుకే రెండు చోట్ల:
గజ్వేల్ ఓటర్లు తన్ని తరిమేస్తారని దొరకు బాగా అర్థమైనట్టుందని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి విమర్శలు గుప్పించారు. స్వయానా ముఖ్యమంత్రికే సొంత నియోజకవర్గంలో గెలుస్తాననే దమ్ము లేకపోవడం.. పదేళ్ల దిక్కుమాలిన పరిపాలనకు నిదర్శనమన్నారు. దొర గారు ఇన్నాళ్లు గజ్వేల్ ప్రజలను కలిసింది లేదని ఆరోపించారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు