DK Aruna: పార్టీ మార్పుపై డీకే అరుణ సంచలన ప్రకటన!
తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు మీడియాలో వస్తున్న కథనాలను తీవ్రంగా ఖండించారు బీజేపీ జాతీయ ఉపాధ్యాక్షురాలు డీకే అరుణ. ఈ విషయంపై పత్రిక ప్రకటన విడుదల చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కావాలనే కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు మైండ్ గేమ్ ఆడుతున్నారన్నారు. బీజేపీ జాతీయ నాయకత్వం తనను గుర్తించి జాతీయ ఉపాధ్యాక్ష పదవి ఇచ్చిందన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో పని చేసే అదృష్టం ఉండాలన్నారు. తన స్పందన గురించి తెలుసుకోకుండా ఇలా కథనాలు రాయడం సరికాదన్నారు. తన రాజకీయ భవిష్యత్తును నిర్ణయించాల్సిన హక్కు మీడియాకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. తనపై తప్పుడు ప్రచారం చేసిన మీడియా సంస్థలపై పరువు నష్టం దావా వేస్తానని డీకే అరుణ తెలిపారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/bjp-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/dk-aruna-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/TS-Politics--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/BJP-National-Vice-President-DK-Aruna-countered-on-BRS-Manifesto-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-10-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Congress-BRS-parties-are-working-together-with-Lopayakari-pact_-DK-Aruna-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-33-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-3-2-jpg.webp)