DK Aruna: డీకే అరుణ ఇంట్లో చొరబడిన అగంతకుడి అరెస్ట్
బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లో చొరబడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని ఢిల్లీకి చెందిన అక్రమ్గా గుర్తించారు. అతడిని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్‌కుమార్, జూబ్లీహిల్స్ పోలీసులు విచారిస్తున్నారు. చొరబాటుకు గల కారణాలను తెలుసుకుంటున్నారు.