DSP : బదిలీల పర్వం.. ఈసారి డీఎస్పీల వంతు.. మొత్తం ఎంత మందంటే?
ఇటీవల ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా డీఎస్పీలను బదిలీ చేసింది. మొత్తం 47 మంది డిఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల వేళ ఒకే పార్లమెంటు పరిధిలో గత నాలుగేళ్లలో మూడు సంవత్సరాల పాటు పని చేసిన వారిని బదిలీ చేశారు.