కుత్బుల్లాపూర్లో కూల్చివేతలు.. కిరోసిన్ పోసుకున్న స్థానికులు
కుత్బుల్లాపూర్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. దేవేందర్ నగర్, కైసర్ నగర్లో అక్రమ కట్టడాల కూల్చివేసేందుకు రెవెన్యూ అధికారులు ప్రయత్నించడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. తమ ఇళ్లు కూల్చేస్తే చచ్చిపోతామంటూ కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకునేందుకు ప్రయత్నించారు.