Couple killed at Elephant Attack: బీభత్సం సృష్టించిన ఏనుగు.. దంపతులు మృతి, మరో వ్యక్తికి తీవ్ర గాయాలు
చిత్తూరు జిల్లాలో ఏనుగుల సంచారం రోజు రోజుకూ ఎక్కువవుతుంది. ఏనుగుల గుంపు తరచూ పంటలపై దాడి చేస్తూనే ఉన్నాయి. దీంతో అక్కడి పల్లె జనాలు తీవ్ర భయబ్రాంతులకు గురవుతున్నారు. అడ్డుకోవడానికి వచ్చిన వారిపై తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి. దీంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని గ్రామ ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నారు. తాజాగా గుడిపాల మండలంలో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో భార్యభర్తలు ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. మరొక వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది.