Cricket betting : హఫీజ్ పేటలో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు
ఐపీఎల్ చుట్టూ లక్షల కోట్లలో వ్యాపారం జరుగుతుంటే మరో పక్క అదే రేంజ్ లో బెట్టింగ్ కూడా నడుస్తుంది. ఐపీఎల్ నేపథ్యంలో నగరంలో జోరుగా బెట్టింగ్ లు సాగుతున్నాయి. హైదరాబాద్లోని హఫీజ్పేట్లో భారీ క్రికెట్ బెట్టింగ్ ముఠాను మియాపూర్ SOT పోలీసులు బట్టబయలు చేశారు.