కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
ఏపీ కానిస్టేబుల్ అభ్యర్థులకు ఎట్టకేలకు తీపి కబురు అందింది. పెండింగ్ లో ఉన్న కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. ఈ బోర్డ్ ఇన్ఛార్జి ఛైర్మన్ ఆకే రవికృష్ణ అధికారిక ప్రకటన చేశారు.