Revanth Reddy-Sharmila: రేవంత్ రెడ్డిని కలిసిన షర్మిల
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వైఎస్ షర్మిల ఈ రోజు హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిశారు. తన కుమారుడి వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తొలిసారిగా షర్మిల రేవంత్ రెడ్డిని కలవడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.