MLC Dasoju Sravan Reaction On Kavitha Resign? | కవిత రాజీనామా? పై దాసోజు శ్రావణ | KTR | RTV
మావోయిస్టుల పై కాల్పుల విరమణ, శాంతి చర్చలు జరగాలన్న డిమాండ్ వస్తున్న వేళ సీపీఐ మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆరునెలల పాటు కాల్పుల విరమణను పాటిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ ఒక లేఖను విడుదల చేశారు.
CM రేవంత్ రెడ్డి, డిప్యూటీ CM భట్టి బుధవారం ఉన్నతాధికారులతో సమావేశమైయ్యారు. ఆపరేషన్ సిందూర్, మాక్డ్రిల్పై చర్చించారు. అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. భారత సైన్యానికి మద్దతు తెలుపుతూ.. గురువారం జరిగే ర్యాలీలో పాల్గొనాలని యువతకు పిలుపు నిచ్చారు సీఎం.
అత్యవసర సర్వీస్ లు అందించే విభాగాల ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఉద్యోగులంతా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి అనధికారికంగా నివసిస్తున్న వారిని తక్షణమే అదుపులోకి తీసుకోవాలన్నారు.
ఆపరేషన్ సిందూర్ పట్ల భారతీయ పౌరుడిగా గర్వంగా ఉందని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మరోవైపు ఢిల్లీలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు సీఎం రేవంత్ ఫోన్ చేశారు. తక్షణమే బయల్దేరి హైదరాబాద్ రావాలని భట్టికి సీఎం సూచించారు.
మిస్ వరల్డ్-2025 పోటీల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు అధికారులతో సమీక్ష నిర్వహించారు. విమానాశ్రయం, అతిథులు బస చేసే హోటల్, కార్యక్రమాలు జరిగే చోట కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అతిథులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు ఉండాలన్నారు.
సంస్థ లాభాల బాట పడుతున్న ఈ సమయంలో RTC కార్మికులు సమ్మె ఆలోచనను విరమించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఆదాయమంతా మీ చేతిలో పెడతాం.. ఎలా ఖర్చు చేద్దామో మీరే సూచన చేయాలని కార్మికులను కోరారు. ఆ డబ్బులు మీ కోసమే ఖర్చు చేస్తానని స్పష్టం చేశారు.
రాబోయే జనాభా లెక్కలతో పాటుగా కులగణన చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాని, కేంద్ర కేబినెట్కు ధన్యవాదాలు తెలిపారు.