ఆంధ్రప్రదేశ్ Telangana: నేడు తిరుమలకు కల్వకుంట్ల శోభ.. ఆ మొక్కు చెల్లించేందుకేనా! తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సతీమణి కల్వకుంట్ల శోభ ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. హైదరాబాద్ నుండి ఉదయం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న అనంతరం ఆమె తిరుమల పయనం అవుతారు. తిరుమలలోని పద్మావతి విఐపి గెస్ట్ హౌస్ ఏరియాలో ఆమె కొద్దిసేపు ఉన్న అనంతరం వీఐపీ విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొంటారు. ఇప్పటికే టిటిడి అధికారులు ఆమెకు బస్సు ఏర్పాట్లతో పాటు దర్శన ఏర్పాట్లను చేశారు. By Shiva.K 08 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Big Breaking: తెలంగాణలో దసరా సెలవుల తేదీలు మార్పు.. సర్కార్ కీలక ఉత్తర్వులు దసరా సెలవుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ఈ నెల 24న దసరా సెలవు ఉంటుందని మొదట ప్రకటించగా.. తాజాగా ఆ తేదీని ఈ నెల 23కు మార్చింది ప్రభుత్వం. దీంతో పాటు ఈ నెల 24న కూడా సెలవు ఉంటుందని స్పష్టం చేసింది. By Nikhil 07 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM KCR Health Update: సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి కీలక అప్డేట్ ఇచ్చిన మంత్రి కేటీఆర్.. ఆయనకేమైందంటే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ కీలక అప్డేట్ ఇచ్చారు. సీఎం కేసీఆర్ ఛాతిలో ఇన్ఫెక్షన్ ఉందని తెలిపారు. ప్రస్తుతం కేసీఆర్ విశ్రాంతిలో ఉన్నారని చెప్పారు. ఛాతిలో సెంకడరీ ఇన్ఫెక్షన్ వచ్చిందని తెలిపారు. కొద్ది రోజులుగా వైరల్ ఫీవర్తో బాధపడుతున్న సీఎం కేసీఆర్.. ప్రస్తుతం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రావడంతో మరింత ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఆయన కొలుకోవడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని తెలిపారు కేటీఆర్. By Shiva.K 06 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Revanth Reddy :తెలంగాణలో బిల్లా రంగాలు ఇద్దరు జనం మీద పడ్డారు.. రేవంత్రెడ్డి హాట్ కామెంట్స్! తెలంగాణలో బిల్లా, రంగాలు ఇద్దరు జనం మీద పడ్డారన్నారు రేవంత్రెడ్డి. కేసీఆర్కు ముఖం చెల్లక బిల్లా రంగాలు తిరుగుతున్నారని.. కాంగ్రెస్ ఏం చేసిందో బిల్లా రంగాలు కేసీఆర్ను అడిగితే చెబుతారన్నారు. మరుగుజ్జులు ఎవరో... ప్రజల మనుషులు ఎవరో 45 రోజుల్లో తేలుతుందన్నారు రేవంత్రెడ్డి. By Trinath 06 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM's Breakfast Scheme: ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్.. శుక్రవారం నుంచే ప్రారంభం.. స్కూల్ విద్యార్థులకు గుడ్ న్యూస్. రేపటి నుంచే(06-10-2023, శుక్రవారం) ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించనుంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా అల్పాహారాన్ని అందించేందుకు ఉద్దేశించిన 'ముఖ్యమంత్రి అల్పాహార పథకం'ను శుక్రవారం లాంఛనంగా ప్రారంభించనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. By Shiva.K 05 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kishan Reddy: 'ఆ విషయంలో కేసీఆర్కు ఆస్కార్, నోబెల్ అవార్డ్ ఇవ్వొచ్చు' తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రధాని మోదీ వస్తే.. పిచ్చి పిచ్చి పోస్టర్లు అంటిస్తారా? అంటూ నిప్పులు చెరిగారు. బట్టకాల్చి మీద వేయడంలో సీఎం కేసీఆర్ దిట్ట అని.. ఆస్కార్, నోబెల్ బహుమతులను ఆయనకు ఇవ్వొచ్చన్నారు. By Shiva.K 05 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ CM KCR: సీఎం కేసీఆర్ కు షాక్.. ఆయనపై పోటీకి 1016 మంది.. కారణమిదే? తెలంగాణ సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తానని ప్రకటించడంతో అక్కడ రాజకీయం మరింత వేడెక్కింది. ప్రత్యర్థిపార్టీల నుంచి పోటీ సంగతి పక్కనపెడితే...అధికారపార్టీని ఇరకాటంలో పెట్టేందుకు గ్రౌండ్ వర్క్ చకచకా జరుగుతోంది. సీఎం కేసీఆర్ పై పోటీ చేసేందుకు కాయితీ లంబాడాలు రెడీ అవుతున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా వెయ్యికిపైగా లంబాడాలు కేసీఆర్ ను ఢీకొడతామంటున్నారు. దీంతో అధికారపార్టీలో కొత్త టెన్షన్ షురూ అయ్యింది. By Bhoomi 05 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana New Mandals: తెలంగాణలో మరో మూడు కొత్త మండలాలు.. నోటిఫికేషన్ విడుదల చేసిన కేసీఆర్ సర్కార్ తెలంగాణలో మరో 3 కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో వనపర్తి జిల్లాలో ఏదుల, నిర్మల్ జిల్లాలో మాలెగావ్, బెల్తారోడా నూతన మండలాలుగా ఏర్పాటు కానున్నాయి. By Nikhil 04 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Big Breaking: ఈ నెల 16న బీఆర్ఎస్ మేనిఫెస్టో.. శుభవార్తకు సిద్ధం కావాలన్న హరీశ్ రావు అక్టోబర్ 16న వరంగల్ లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ఉంటుందని మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. ఆ సభలోనే సీఎం మేనిఫెస్టో ప్రకటిస్తారన్నారు. మన మేనిఫెస్టో ప్రత్తిపక్షాల మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంటుందన్నారు. ప్రజలంతా శుభవార్త వినడానికి సిద్ధంగా ఉండాలని కోరారు. By Nikhil 04 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn