ఆంధ్రప్రదేశ్ vijayawada: హయత్ ప్లేస్ హోటల్‌ను ప్రారంభించిన సీఎం జగన్ విజయవాడలో సీఎం జగన్ పర్యటించారు. గుణదలలో హయత్ ప్లేస్ హోటల్‌ను సీఎం జగన్ ప్రారంభిచారు.ఈ కార్యక్రమంలో పలు అధికారులు, వైసీపీ నేతలు పాల్గొంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. By Vijaya Nimma 18 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
గుంటూరు Sajjala Ramakrishna Reddy: ప్రజలకు ఏం చేశారో చంద్రబాబు చెప్పగలరా.? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని ఆగం చేయాలని చూస్తున్నారని ప్రభుత్వ ప్రధాన సలహాదారుల సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో బాబు ఓ పక్క, దత్తపుత్రుడు, మరోపక్క, తన సుపుత్రుడు ఇంకోపక్క తిరుగుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు మంచి చేయని చంద్రబాబు.. మంచి చేస్తున్న జగన్‌ను ఎందుకు తిడుతున్నారని ప్రశ్నించారు. By Karthik 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan: పంద్రాగష్టు వేడుకల్లో ఆసక్తికర ఘటన.. కింద పడిన మెడల్ తీసిన సీఎం జగన్ 77వ స్వాతంత్ర్య దినోత్స వేడుకలు అంబరాన్నంటాయి. దేశ వ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్స వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా పంద్రాగష్టు వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో సీఎం జగన్ పతాకావిష్కరణ చేశారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులకు మెడల్స్ ప్రదానం చేశారు సీఎం. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులకు మెడల్స్ ప్రదాన సమయంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. గ్రే హౌండ్స్ కు చెందిన గౌరు నాయకుడుకు మెడల్ ప్రధానం చేశారు సీఎం జగన్. ఆ తర్వాత గౌరు నాయుడు సెల్యూట్ చేస్తుండగా బహుకరించిన మెడల్ కిందపడటంతో.. సీఎం జగన్ వెంటనే కింద పడిన మెడల్ ను తీసి మళ్లీ.. సంబంధిత వ్యక్తికి ప్రదానం చేశారు. దీంతో గౌరు నాయుడు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. By E. Chinni 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ గుంటూరులో జనసేన ఆందోళన.. వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు రాష్ట్రంలో గాడి తప్పిన పాలన.. అవినీతి తప్ప.. ప్రజల కష్టాలు ఆ మంత్రులకు, ఎమ్మెల్యేకు కనిపించవు .. వైసీపీ పాలనలో పెరిగిన అరాచకాలు..!!, వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసిన సీఎం జగన్ సర్కార్ అంటూ ఆందోళన బాట పట్టారు జనసేన నాయకులు. వైసీపీ పాలనకు వ్యతిరేకంగా క్విట్ జగన్ ఏపీ అంటూ నినాదాలు చేశారు. By Vijaya Nimma 09 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ అధికారులను నిలదీయడానికి కాదు..వెన్ను తట్టడానికి వచ్చా: సీఎం జగన్! అల్లూరి జిల్లా కూనవరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా బాధితులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. వారం రోజుల కిందట గోదావరి నది పొంగి వరద వచ్చిన పరిస్థితుల్లో దాదాపు 16 లక్షల క్యూసెక్కుల పరివాహంతో నీళ్లు వచ్చాయన్నారు.మన ప్రాంతాలకు ఎక్కడెక్కడ దెబ్బ తగిలి నష్టం జరిగిందో ఆ నష్టానికి సంబంధించి కలెక్టర్‌కు వరద వచ్చినప్పుడే ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు By Bhavana 07 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన.. సాయం తిరుపై ప్రజలతో ముఖాముఖి ఈ మధ్య భారీ వర్షాల కారణంగా గోదావరి ఉగ్రరూపం దాల్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం జగన్ రెండు రోజులు వరద ప్రాంతాల్లో పర్యటించనున్నారు. అల్లూరి, ఏలూరు, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో ఇటీవల పలు ప్రాంతాలు వరద ముంపునకు గురి అయ్యాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండు రోజులు పర్యటించి వరద ప్రభావిత గ్రామాల ప్రజలతో నేరుగా సీఎం మాట్లాడుతారు. వరద సహాయ, పునరావాస చర్యలు అమలు చేసిన తీరుపై స్వయంగా బాధిత కుటుంబాలను అడిగి మరి తెలుసుకుంటారు సీఎం జగన్. By Vijaya Nimma 07 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ సైకో టైమ్ అయిపోయింది.. నా ఉగ్రరూపం చూపిస్తా: చంద్రబాబు సైకో టైమ్ అయిపోయిందని.. వైసీపీ నేతలకు నా ఉగ్రరూపం చూపిస్తానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు. ఆదివారం రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా నెల్లూరుకు వచ్చారు చంద్రబాబు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సైకో ఓడిపోతాడని, ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అంటూ హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రానికి.. జగన్ శనిలా దాపురించారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 5 లక్షల ఎకరాల్లో వరి విస్తీర్ణం తగ్గిపోయిందని.. By E. Chinni 06 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ముంపు మండలాల్లో సీఎం జగన్ పర్యటన.. షెడ్యూల్ ఇదే.. వరద ప్రభావిత, ముంపు మండలాల్లో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ పర్యటించనున్నారు. సోమ, మంగళ వారాల్లో రెండు రోజుల పాటు అల్లూరి సీతారామ రాజు జిల్లా, ఏలూరు, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి. సోమవారం ఉదయం 9:30 నిమిషాలకు తాడేపల్లి నుంచి సీఎం బయలు దేరనున్నారు. 10:30 గంటలకు అల్లూరి సీతారామ రాజు జిల్లా కూనవరం మండలం కోతుల గుట్ట గ్రామానికి ముఖ్యమంత్రి.. By E. Chinni 06 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోంది.. రాష్ట్రంలో పుంగనూరు రాజకీయ వేడి కొనసాగతూనే ఉంది. తాజాగా దీనిపై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న స్పందించారు. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. పోలీసుల వల్లే పుంగనూరులో ఉద్రిక్త పరిస్థితి నెలకొందన్నారు. రోడ్డుకు లారీని అడ్డుగా పెట్టిన వారిపై పోలీసులు కేసులు ఎందుకు పెట్టలేదన్నారు. లారీని తీయడానికి వచ్చిన టీడీపీ కార్యకర్తలపై లాఠీఛార్జి చేశారని మండిపడ్డారు. By Karthik 06 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn