అవినాష్ ఇంటికి సీఎం జగన్
పూర్తిగా చదవండి..విజయవాడలోని గుణదలలో హయత్ ప్లేస్ స్టార్ హోటల్‌ను సీఎం జగన్ ప్రారంభించారు. హోటల్ ప్రారంభ అనంతరం తూర్పు నియోజకవర్గ ఇంఛార్జ్ దేవినేని అవినాష్ ఇంటికి సీఎం వెళ్లారు. తన నివాసానికి రావాలని అవినాష్ కోరటంతో.. మర్యాదపూర్వకంగా ఆయన ఇంటికి వెళ్లి సీఎం జగన్ కలిశారు. 15 నిమిషాల పాటు అవినాష్ నివాసంలో భేటీ అయ్యారు. బెజవాడ రాజకీయాల్లో అవినాష్ ఇంటికి సీఎం వెళ్లడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుత రాజకీయాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.
ప్రతిపక్షాల ఎత్తుగడలపై దిశా నిర్ధేశం
ఉమ్మడి కృష్ణాజిల్లాలో లోకేష్ యువగళం పాదయాత్ర ఎంటరవుతున్న సమయంలో అవినాష్ ఇంటికి సీఎం వెళ్లడం పట్ల రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. టీడీపీ ఎత్తుగడలు..లోకేష్ పాదయాత్రపై అవినాష్‌కు దిశా నిర్దేశం చేస్తారంటూ వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. శుభాకార్యాలు, పరామర్శలకు మినహా గతంలో ఎన్నడూ మర్యాదపూర్వక ఆహ్వానం మేరకు ఏ నాయకుడి ఇంటికీ వెళ్లని సీఎం.. మొదటిసారిగా ఎటువంటి కార్యక్రమం లేకుండా అవినాష్ ఇంటికి సీఎం జగన్ వెళ్లారు.
కార్పొరేషన్ చైర్మన్లపై చర్చ
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ నేపథ్యంలో నామినేటెడ్ పదవులు, పార్టీ అనుబంధ విభాగాలు, రీజినల్ ఇన్చార్జిలను వైసీపీ ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. 2014 ఎన్నికలకు ఇప్పటి నుంచే వైసీపీ పార్టీని సీఎం జగన్ సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల వేళ వైసీపీ అధిష్టానం భారీ పదవుల కోజం నేతల్లో జోష్ పెరింగింది. దీంతో నేడు పార్టీ ముఖ్య నేతలతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. ఏపీలో 100కు పైగా కార్పొరేషన్ చైర్మన్ల పదవులపై చర్చనున్నారు. అయితే 100కు పైగా కార్పొరేషన్ చైర్మన్ల పదవీకాలం ముగియటంతో.. కొత్త చైర్మన్లను ఏపీ ప్రభుత్వం కీలక భేటీ కానునున్నది. ఈ సమావేశానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ, విజయసాయిరెడ్డి హాజరుకానున్నారు. ఈ భేటీలో నియామకంపై సీఎం జగన్ ఓ క్లారిటీ ఇచ్చేఅవకాశం ఉందని సమాచారం.
పాలక మండలి సభ్యుల నియామకాలపై దృష్టి
ఇక టీడీపీ పాలక మండలిపై దృష్టి పెట్టిన సీఎం జగన్. నేడు టీటీడీ బోర్డు మెంబర్లను కూడా సీఎం ఖరారు చేయనున్నారు. ఇప్పటికే టీటీడీ చైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డిని నియమించిన సీఎం.. తాజాగా పాలక మండలి సభ్యుల నియామకాలపై దృష్టి పెట్టారు. పాలక మండలి సభ్యులతో పాటు ప్రత్యేక ఆహ్వానితుల నియామకాలపై తుది జాబితాను సీఎం జగన్ ఖరారు చేయనున్నారు.
[vuukle]