Nadendla Manohar: నిబద్దత కలిసిన నాయకున్ని అరెస్ట్ చేశారు
నిబద్దత కలిగిన రాజకీయ నేతను అరెస్ట్ చేయడం ఏంటని జనసేన నేత నాదేండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. చంద్రబాబును పరామర్శించడానికి వెళ్తుంటే అడ్డుకుంటున్నారన్నారు.
నిబద్దత కలిగిన రాజకీయ నేతను అరెస్ట్ చేయడం ఏంటని జనసేన నేత నాదేండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. చంద్రబాబును పరామర్శించడానికి వెళ్తుంటే అడ్డుకుంటున్నారన్నారు.
విశాఖలో కోటికత్తి కేసు దాడిపై విచారణ ఎన్ఐఏ కోర్టులో నిర్వహించారు. లాయర్ల అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న కోర్టు విచారణ వాయిదా వేసింది. అంతేకాకుండా నిందితుడు శ్రీనివాస్‌రావును విశాఖ సెంట్రల్ జైల్‌కు తరలించాలన్న ఎన్ఐఏ అభ్యర్థనను కోర్టు ఒప్పుకుంది.
దివంగత నేత, మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన కుమార్తె, వెస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల నివాళులర్పించారు.
భూ రక్ష, జగనన్న శాశ్వత భూ హక్కుపై ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారులకు పలు సూచనలు చేశారు. రెవెన్యూ విభాగంలో వస్తున్న విప్లవాత్మకంగా మార్పులను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని సీఎం సూచించారు. సంస్కరణల వల్ల ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలపై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రి బూడి ముత్యాల నాయుడు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
టీడీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అనకాపల్లికి చెందిన టీడీపీ నేత మలశాల భరత్ కుమార్, ఆయన తండ్రి విశాఖ డెయిరీ డైరెక్టర్ రమణారావు, ఆయన తల్లి మాజీ ఎంపీపీ ధనమ్మలు సీఎం క్యాంపు కార్యాలయంలో వైసీపీలో చేరారు. వారికి సీఎం జగన్ మోహన్ రెడ్డి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
గోదావరిని అడ్డు పెట్టుకుని కోట్ల రూపాయలను దొచేస్తున్నారని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఈ ప్రభుత్వం ఇసుక విధానంలో దళితులు, బలహీన వర్గాల పొట్టకొట్టిందన్నారు. రాజమండ్రిలో ఇసుక ర్యాంపు వద్ద టీడీపీ ఆధ్వర్యంలో ఇసుక మాఫియా పై సత్య గ్రహ ధర్నా చేపట్టారు. ఈ సత్యాగ్రహ దీక్షలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు.
జగన్ ఒక్క అవకాశం ఇస్తే చాలు... తమ సత్తా ఏంటో చూపించుకోవడానికి సిద్ధంగా ఉన్న వారసులకు.. జగన్ పచ్చ జెండా ఊపినట్టు తెలుస్తోంది. చాలాకాలంగా సీఎం జగన్ దగ్గర పెండింగ్ లో ఉన్న వారసుల రాజకీయ ఆరంగేట్రం లిస్టు కి లైన్ క్లియర్ అయినట్టు తాడేపల్లి లో టాక్ నడుస్తుంది. వైసీపీలో చాలామంది వారసులు తమ రాజకీయ అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్నారు.. తమ తండ్రులు సత్తా చాటిన నియోజకవర్గం నుండి బరిలోకి దిగాలనుకుంటున్న వైసీపీ యువ నాయకుల లిస్ట్ వైసీపీ లో చాలానే ఉంది
వైసీపీ, బీజేపీలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. బీజేపీ వైసీపీ పేర్లు వేరుగా ఉన్నా రెండు పార్టీలు ఒకటేనన్నారు. ఏపీలో మోడీ దత్త పుత్రుడుగా జగన్ వ్యవహరిస్తున్నాడంటూ మండిపడ్డారు. డబుల్ ఇంజన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం విధానం ప్రకటించిందన్నారు. ఫెడరల్ వ్యవస్థను నాశనం చేసేందుకే ఈ డబుల్ ఇంజన్ విధానం ప్రవేశ పెట్టారన్నారు.
చంద్రబాబు మెంటల్ ఇన్ బ్యాలెన్స్ లో వున్నారని మంత్రి నాగార్జున అన్నారు. 14 సంవత్సరాల కాలంలో అదికారాన్ని అడ్డుపెట్టుకొని చంద్రబాబు కోట్లు దండుకున్నారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. సంపాదనే ధ్యేయంగా మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. అందుకే సీఎం జగన్ పై తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నాడని చెప్పారు.