BREAKING: మరికాసేపట్లో వైసీపీ సెకండ్ లిస్ట్..
మరికాసేపట్లో వైసీపీ సెకండ్ లిస్ట్ విడుదల కానుంది. 20 నుండి 25 మంది అభ్యర్థులు మార్పులకు సంభందించిన లిస్ట్ ప్రకటించనున్నారు సజ్జల రామకృష్ణ రెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ.
మరికాసేపట్లో వైసీపీ సెకండ్ లిస్ట్ విడుదల కానుంది. 20 నుండి 25 మంది అభ్యర్థులు మార్పులకు సంభందించిన లిస్ట్ ప్రకటించనున్నారు సజ్జల రామకృష్ణ రెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ.
బళ్ళారి మాజీ ఎంపీ శాంతమ్మ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. వైసీపీ సిద్దాంతాలు, పనులు చూసి పార్టీలో చేరినట్లు తెలిపారు. దేశంలో ఏ పార్టీ చేయని సంక్షేమ కార్యక్రమాలు సీఎం జగన్ చేస్తున్నారని కొనియాడారు.
వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. విశాఖకు చెందిన కీలక నేత దాడి వీరభద్రరావు పార్టీకి రాజీనామా చేశారు. అనకాపల్లి టికెట్ ఆశించిన ఆయనకు నిరాశే ఎదురవడంతో.. పార్టీని వీడారు. తన రాజీనామా లేఖను సీఎం జగన్‌కు పంపించారాయన.
ఏపీలో 21.75 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతుందని మంత్రి జోగి రమేష్ అన్నారు. పవన్‌కు ఏపీలో ఆధార్ కార్డు లేదు, ఓటు లేదు. చంద్రబాబు తాబేదారుగా పవన్ పనిచేస్తున్నారని మండిపడ్డారు.
తక్షణమే అగ్రిగోల్డ్ బాధితులకు సొమ్ములు చెల్లించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం జగన్ కు నారా లోకేష్ లేఖ రాశారు. అగ్రిగోల్డ్ బాధితులు యువగళం పాదయాత్రలో తనను కలిసి గోడు వెళ్లబోసుకున్నారని లేఖలో పేర్కొన్నారు.
ఇటీవల జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీ కృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. 10 మంది ఎమ్మెల్సీ లు, 30 మంది కార్పొరేటర్లు తనతో టచ్ లో ఉన్నారని అన్నారు. సమయం వచ్చినప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అంటూ వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు.
వైసీపీలో మరో ఎమ్మెల్యే రాజీనామా బాటలో ఉన్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్‌తో జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే భేటీ అయ్యారు. పవన్, నాదెండ్ల మనోహర్‌తో గంటపాటు చర్చలు జరిపారు. వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని పాపులర్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జనసేన పార్టీ అభ్యర్థిగా నెల్లూరు టికెట్ రేసులో ఉన్నారా ? ప్రస్తుతం జానీ మాస్టర్ అంధ్రప్రదేశ్ సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తోంది.
భీమవరంలో జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం జగన్. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ పై సెటైర్లు వేశారు. మ్యారేజీ స్టార్ ముచ్చటగా మూడు పెళ్లిళ్లు చేసుకుని మూడు సంవత్సరాలు కూడా కాపురం చేసి ఉండరని.. కార్లను మార్చినట్లు భార్యలను మారుస్తున్నాడని కౌంటర్లు వేశారు.