Chiranjeevi: చిరుతో ముగ్గురు టాప్ డైరెక్టర్స్..! ఆ సినిమాల లిస్ట్ ఇదే..?
భోళా శంకర్ తర్వాత మెగాస్టార్ తెలుగు ఇండస్ట్రీ టాప్ డైరెక్టర్స్ అయిన ఆ ముగ్గురి తో సినిమాలకు ఒకే చెప్పారు. ప్రస్తుతం వాటి పనుల్లో బిజీగా ఉన్నారు.
భోళా శంకర్ తర్వాత మెగాస్టార్ తెలుగు ఇండస్ట్రీ టాప్ డైరెక్టర్స్ అయిన ఆ ముగ్గురి తో సినిమాలకు ఒకే చెప్పారు. ప్రస్తుతం వాటి పనుల్లో బిజీగా ఉన్నారు.
చిరంజీవి సినీ జీవితాన్ని మలుపు తిప్పిన 'ఖైదీ' సినిమాకు సీక్వెల్ గా మరో సినిమాను డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో రాబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
ఒక్క ఫ్లాప్.. ఒకే ఒక్క ఫ్లాప్.. చిరంజీవి ఆలోచన విధానాన్ని, అతడి భవిష్యత్తు ప్లాజెక్టుల్ని సమూలంగా మార్చేసింది. కళ్యాణ్ కృష్ణతో చిరు చేయబోయే ప్రాజెక్ట్ దాదాపు ఆగిపోయింది.
గణపథ్ తెలుగు వెర్షన్ టీజర్ ను టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో పంచుకున్నారు. "ప్రియాతి ప్రియమైన టైగర్ ష్రాఫ్, కృతి సనన్, అన్నింటికి మించి నా గురువు అమితాబ్ బచ్చన్ నటించిన గణపథ్ చిత్రం టీజర్ పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.
చంద్రబాబు ఏ రోజు కక్షసాధింపులు చేయలేదన్నారు నట్టి కుమార్. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన అలాంటి వ్యక్తి జైలులో ఉండకూడదని.. ఆయనపై పెట్టిన కేసులలో నిజాలు ఉన్నాయా? లేవా? అన్న అంశాలను కోర్టులు చూసుకుంటాయని అన్నారు. చంద్రబాబు అరెస్ట్ పై టాలీవుడ్ స్పందించకపోడం బాధాకరం అన్నారాయన.
రాజ్యాధికారంలో కాకతీయుల కాలం నుంచి కమ్మ,రెడ్లకు పట్టుందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఎన్టీఆర్ వచ్చిన తర్వాతే కమ్మవారికి రాజ్యాధికారం వచ్చిందనేది కరెక్ట్ కాదన్నారు. కులం అన్నింటిలోనూ ఇప్పుడు ముఖ్యమైనదేనన్నారు. ఆంధ్రప్రదేశ్ లోక్ సభ, శాసనసభలో ఎవరెవరు? పుస్తక సమీక్ష కార్యక్రమంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పాల్గొన్నారు.
మెగాస్టార్ చిరంజీవి మంచి దూకుడు మీద ఉన్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా రెండుకొత్త సినిమాలను ప్రకటించారు. ఎంటర్ టైన్ మెంట్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే ఇందులో ఎలాంటి పొలిటికల్ అంశాలు, కాంట్రవర్సీలు లేకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
గుడివాడలో కూడా చిరు అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు ఏర్పాటు చేశారు.ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని వచ్చారు. అయితే గతంలో కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఎంతటి సంచలాన్ని రేపాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ సందర్భంలో నాని ఏకంగా పకోడిగాళ్లు అంటూ ఎద్దేవా చేశారు. అలాంటి కొడాలి నాని చిరు పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
స్టార్ హీరోల నుంచి సినిమా రావాలంటే మినిమం ఏడాది వెయిట్ చేయాల్సిందే. ఓ సినిమా వచ్చిన ఏడాది తర్వాత గానీ మరో సినిమా రావడం లేదు. మరి ఈ గ్యాప్ లో ఫ్యాన్స్ ఏం చేయాలి. ఇప్పుడు దీనికి సమాధానం దొరికేసింది. అదే రీ-రిలీజ్. అవును.. ప్రస్తుతం టాలీవుడ్ లో రీ-రిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతోంది.