Chandrayaan-3: చందమామ పెరట్లో పసిపాప(రోవర్) పరుగులు.. క్యాప్చర్ చేసిన తల్లి.. వైరల్ వీడియో!
జాబిల్లిపై చక్కర్లు కొడుతోన్న ప్రజ్ఞాన్ రోవర్‌కి సంబంధించి ఇస్రో మరో వీడియో పోస్ట్ చేసింది. రోవర్ తిరుగుతున్న విజువల్‌ని ల్యాండర్ క్యాప్చర్ చేసింది. 'చందమామ పెరట్లో చిన్నపిల్ల ఆడపడుచుగా ఉల్లాసంగా ఆడుతుంటే తల్లి ఆప్యాయంగా చూస్తోంది' అని స్మైలీ ఎమోజీ పెట్టింది.