Chandrayaan-3 Success Meet : అప్పుడు కన్నీళ్లతో...ఇప్పుడు ఆనందభాష్పాలతో...!!
ఆగస్టు 23న, చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ భాగం ఉపరితలంపై విజయవంతంగా దిగింది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ అవతరించింది. 7 సెప్టెంబర్ 2019 చంద్రయాన్ -2 విఫలమవ్వడంతో ఇస్రో శాస్త్రవేత్తలు కన్నీళ్లు పెట్టుకున్న క్షణం అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పటి ఇస్రో ఛైర్మన్ కె. శివన్ కన్నీళ్లు పెట్టుకున్న సందర్బంలో ప్రధాని మోదీ ఆయన్ను కౌగిలించుకుని ఓదార్చిన క్షణం యావత్ ప్రపంచాన్ని కదిలించింది. మీరు కన్న కలలు త్వరలోనే సాకారం అవుతాయని ప్రధాని మోదీ ఓదార్చిన తీరు యావత్ ప్రజలను కంటతడి పెట్టించింది. అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. అప్పుడు కన్నీళ్లతో...ఇప్పుడు ఆనందభాష్పాలతో ఇస్రోలోకి అడుగుపెట్టారు మోదీ.