Top Google Searches: చంద్రయాన్ 3 ఈ సంవత్సరం గూగుల్ టాప్ సెర్చ్.. నెటిజన్లను ఆకర్షించిన చందమామ!
2023 Google Search: చంద్రయాన్ 3 2023లో గూగుల్ సెర్చ్ లో ప్రజలు అత్యధికంగా వెతికిన విషయం.. చంద్రయాన్ 3 తరువాత ఇజ్రాయెల్ సమస్య నిలిచింది
2023 Google Search: చంద్రయాన్ 3 2023లో గూగుల్ సెర్చ్ లో ప్రజలు అత్యధికంగా వెతికిన విషయం.. చంద్రయాన్ 3 తరువాత ఇజ్రాయెల్ సమస్య నిలిచింది
ఇస్రో మరో విజయాన్ని సొంతం చేసుకుంది. చంద్రయాన్-3 ప్రాజెక్టులో భాగంగా ప్రయోగించిన ప్రొపల్షన్ మాడ్యుల్‌ను చంద్రుని కక్ష్య నుంచి భూ కక్ష్య వరకు మళ్లించినట్లు ఇస్రో ప్రకటన చేసింది. కక్ష్య పొడగింపు, ట్రాన్స్ ఎర్త్ ఇంజెక్షన్ విన్యాసాలతో దీన్ని పూర్తి చేసినట్లు పేర్కొంది.
ఇస్రో మాజీ చీఫ్ కే.శివన్‌పై ప్రస్తుత చీఫ్ సోమనాథ్ సంచలన ఆరోపణలు చేశారు. ఇస్రో చీఫ్ కాకుండా శివన్ తనను అడ్డుకునే ప్రయత్నం చేశారంటూ తన ఆత్మకథలో రాసుకొచ్చారు సోమనాథ్. 2019లో VSSC డైరెక్టర్ పదవి కూడా తనకు రాకుండా చేయాలని చూశారంటూ బాంబు పేల్చారు.
చంద్రయాన్ -3 మిషన్ లో భాగంగా ఆగస్టు 23న చంద్రుడిపై దిగిన విక్రమ్ ల్యాండర్ పై ఇస్రో కీలక విషయాన్ని వెల్లడించింది. చంద్రుడిపై ల్యాండింగ్ సమయంలోనే విక్రమ్ ల్యాండర్ తనదైన ముద్రవేసిందని తెలిపింది. చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ మాడ్యూల్, చంద్రుని దక్షిణ ధ్రువంపై చారిత్రాత్మక టచ్ డౌన్ చేస్తున్నప్పుడు చంద్రుని ఉపరితలంపై ఎజెక్టా హాలో ఏర్పడిందని వెల్లడించింది.
ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోవర్ మళ్లీ క్రియాశీలకంగా మారే అవకాశాలు కొట్టివేయలేమని.. అది నిద్రలేవడంపై ఇప్పటికీ కూడా తమ ఆశలు సజీవంగానే ఉన్నాయని పేర్కొన్నారు. కొచ్చిలోని మలయాళ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సోమనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అమెరికా అంతరీక్ష సంస్థ నాసా(NASA) ఇండియన్ టెక్నాలజీని అడిగినట్లు తాజాగా ఇస్రో చీఫ్ ఎస్ సోమ్‌నాథ్ చెప్పారు. చంద్రయాన్ 3 సక్సెస్ తరువాత నాసా మన టెక్నాలజీని అడిగినట్టు తెలిపారు. ప్రస్తుతం ఇండియా బెస్ట్ ఎక్విప్మెంట్స్‌ని, రాకెట్లను తయారు చేసే స్థాయికి ఎదిగిందని.. అందుకు ప్రధాని మోదీనే కారణమన్నారు.
ఇస్రో ప్రతిష్టాత్మక ప్రయోగం చంద్రయాన్-3 కథ ఇంక ముగిసినట్టే. చంద్రుని మీద ఉన్న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లు మేల్కొనే ఛాన్స్ కనిపించడం లేదని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఎంత ప్రయత్నం చేస్తున్నా ఫలితాలు కనిపించడం లేదని చెబుతున్నారు.
సూర్యుడు మరోసారి చంద్రుడిపై అస్తమించాడు. చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లు 14 భూమి రోజులకు సమానమైన చంద్రుడి రోజున మేల్కొనలేదు. అంటే భారత్ మిషన్ ముగిసినట్టేనన్న వాదన వినిపిస్తోంది. చంద్రయాన్-3లోని ప్రజ్ఞాన్, విక్రమ్ ద్వయం మేల్కొనకపోతే, అది ఎప్పటికీ భారత లూనార్ అంబాసిడర్‌గా అక్కడే ఉంటుందని ఇస్రో ఇదివరకే తెలిపింది. చంద్రుడి ఉపరితలంపై కొన్ని ప్రయోగాలను పునరావృతం చేయడానికి ఇది ఒక అవకాశం. కానీ విక్రమ్, ప్రజ్ఞాన్ స్పందించలేదు.
ల్యాండర్, రోవర్ నుంచి సంకేతాలను పునరుద్ధరించేందుకు ఇస్రో తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ నెల 22 నుంచి చంద్రుడిపై సూర్యుడు ప్రకాశించడంతో శాస్త్రవేత్తలు వాటిని యాక్టివేట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు 2019లో చైనాకు చెందిన ల్యాండర్ చాంగ్ 4 రోవర్ యుటు 2ను మేల్కోపినట్లు నిపుణులు తెలిపారు. అయితే దక్షిణ ధ్రువంపై పరిస్థితులు వేరని...యాక్టివేట్ పై ఆశలు చాలా తక్కువగా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాగా విక్రమ్, ప్రజ్ఞాన్ ఆటోమేటిక్‌గా మేల్కొంటాయాని ఇస్రో తెలిపింది.