ఇంటి అద్దె చెల్లించని వ్యక్తితో నాలుగేళ్లుగా పోరాటం!
ఖాళీగా ఉంది కదా అని ఇల్లు అద్దెకిచ్చిన పాపానికి ఇంటి యజమానికి పట్టపగలే చుక్కలు కనిపించాయి.రూం అద్దెకు తీసుకున్న వ్యక్తి ఓనర్‌కి అద్దె కట్టకపోవడంతో కోర్టు చుట్టూ తిరిగాల్సి వచ్చింది.నెల కాదు, రెండు నెలలు కాదు ఏకంగా రెండేళ్ల పాటు న్యాయపోరాటం చేసి అద్దె చెల్లించని వ్యక్తిని ఇంటి నుంచి వెళ్లగొట్టాల్సి వచ్చింది.ఈ చేదు అనుభవం ఏకంగా ప్రముఖ కార్పొరేట్ సంస్థ క్యాపిటల్ మైండ్ సీఈఓకు ఎదురయ్యింది.ఆయన ఆవేదనను తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.అంతేకాదు రియల్ ఎస్టేట్ చేయడం అంత ఈజీ కాదని పేర్కొన్నారు.