Bommarasipeta: మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ
మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ ఎదురైంది. ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడానికి వెళ్లిన మంత్రిని గ్రామస్తులు అడ్డుకున్నారు. పట్టాలు లబ్దిదారులకు కాకుండా తన అనుచరులకు ఇస్తున్నారని వారు ఆరోపించారు.
మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ ఎదురైంది. ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడానికి వెళ్లిన మంత్రిని గ్రామస్తులు అడ్డుకున్నారు. పట్టాలు లబ్దిదారులకు కాకుండా తన అనుచరులకు ఇస్తున్నారని వారు ఆరోపించారు.
సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాజీనామాతోనే మునుగోడు అభివృద్ధి చెందిందన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కేసీఆర్ డబ్బులు పంచి తన అభ్యర్థిని గెలిపించుకున్నారని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు.
ఎన్నికల వ్యాహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న సాధారణ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టబోతోందన్నారు. ఆ రాష్ట్రంలో జరిగిన అభివృద్దే అందుకు నిదర్శనమన్నారు. మరోవైపు రాజస్థాన్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ-కాంగ్రెస్ పార్టీల మధ్య గట్టిపోటీ ఉంటుందన్నారు.
అలంపూర్ బీఆర్ఎస్లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. అబ్రహంకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ.. ఎంపీపీ వర్గం భారీ ర్యాలీ నిర్వహించింది. అబ్రహం ఎమ్మెల్యే అభ్యర్థిగా కొనసాగితే తాము సహకరించేది లేదని స్పష్టం చేశారు.
కాంగ్రెస్‌పై నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలు తనను రాజకీయంగా ఎదుర్కోలేక తనపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. తన రాజకీయ జీవితం ప్రజలకే అంకితమన్న ఆయన.. ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమన్నారు.
హోం మంత్రి మహమూద్ అలీపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. హోం మంత్రి ఓ రబ్బర్ స్టాంప్‌లా మారారని విమర్శించారు. రానున్న రోజుల్లో తెలంగాణ మర్డర్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారే అవకాశం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
హైకోర్టు ఆర్డర్ కాపీతో డీకే అరుణ అసెంబ్లీకి వెళ్లారు. అక్కడ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, అసెంబ్లీ సెక్రటరీ అందుబాటులో లేకపోవడంతో హైకోర్టు ఆర్డర్ కాపీని ఆమె అసెంబ్లీ సిబ్బందికి ఇచ్చినట్లు తెలిపారు. స్పీకర్ వెంటనే హైకోర్టు ఆర్డర్ కాపీని ఇంప్లిమెంట్ చేయాలని డీకే అరుణ కోరారు.