తెలంగాణ నేతల రాఖీ వేడుకలు .. చూసొద్దాం రండి
తెలంగాణలో ఘనంగా రక్షా బంధన్ వేడుకులు కొనసాగుతున్నాయి. వివిధ పార్టీ నేతలకు మహిళలు రాఖీలు కట్టి వారి మధ్య ఉన్న అప్యాయతను పంచుకుంటున్నారు. అన్నా, తమ్ముళ్లకు ఆడపడుచులు రాఖీలు కట్టారు.
తెలంగాణలో ఘనంగా రక్షా బంధన్ వేడుకులు కొనసాగుతున్నాయి. వివిధ పార్టీ నేతలకు మహిళలు రాఖీలు కట్టి వారి మధ్య ఉన్న అప్యాయతను పంచుకుంటున్నారు. అన్నా, తమ్ముళ్లకు ఆడపడుచులు రాఖీలు కట్టారు.
కేసీఆర్వి అన్నీగాలి మాటలే అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఘాట వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రలో 24 గంటల విద్యుత్ అందడంలేదని ఆయన ఆరోపించారు. కేసీఆర్ మాటలు నమ్మి నాట్లు వేసుకున్న రైతులకు ఇప్పుడు విద్యుత్ అందకపోవడంతో ఏం చేయాలో తోచడం లేదన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీల కోసం తాను నల్గొండ స్థానాన్ని త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. బీసీలకు కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తోందని ఎంపీ వివరించారు.
క్రీడలు విద్యార్థుల మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో పర్యటించిన ఆయన.. అక్కడ నిర్వహించిన జాతీయ క్రీడా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. విద్యార్థుల సమస్యలు తీర్చాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ కార్యకర్తలు మంత్రి గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయ ముట్టడికి ప్రయత్నించారు. వారిని పోలీసులు అరెస్ట్ చేసి బలవంతంగా పోలీస్ స్టేషన్లకు తరలించారు.
సీఎం కేసీఆర్పై ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గోషామహల్ నియోజకవర్గ బీఆర్ఎస్ టికెట్ ఎంఐఎం చేతిలో ఉందన్నారు. బీజేపీ అధిష్టానం తనపై సానుకూలంగా ఉందని, రానున్న రోజుల్లో తనపై ఉన్న సస్పెన్షన్ను ఎత్తివేసే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు.
ప్రభుత్వ విప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఆర్టీవి ప్రశ్నించే ప్రయత్నం చేయగా.. బాల్క సుమన్ ఎలాంటి ఆన్సర్ ఇవ్వలేదు. అంతేకాదు ఆర్టీవీ రిపోర్టర్ ప్రశ్నిస్తుంటే అతన్ని తోసివేస్తే వెళ్లాడు. కాగా బాల్క సుమన్ కాంగ్రెస్లో బీఆర్ఎస్ కోవర్టులు ఉన్నారని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
నర్సాపూర్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎమ్మెల్యే సీటును వుదులుకోబోనని స్పష్టం చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చే వారికి తనకంటే పెద్ద పదవులు ఇచ్చినా తాను వారికి గౌరవం ఇస్తానని తెలిపారు. నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు అంతా తనకే మద్దతు తెలుపుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు
కాంగ్రెస్ పార్టీ హామీలను ప్రజలు నమ్మొద్దని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఇటీవల కర్నాటకలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని ఆయన గుర్తు చేశారు. ప్రజలు కాంగ్రెస్ నేతల హామీల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.