MLC Kavitha: కామారెడ్డిలో కేసీఆర్ విజయం ఖాయం
సీఎం కేసీఆర్‌ను కామారెడ్డి జిల్లా ప్రజలు ఆధరిస్తారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. జిల్లాలోని మాచారెడ్డి మండల పరిధిలోని ప్రజలు కేసీఆర్‌కే ఓట్లే వేస్తామని తీర్మానాలు చేయడం సంతోషంగా ఉందన్నారు.
సీఎం కేసీఆర్‌ను కామారెడ్డి జిల్లా ప్రజలు ఆధరిస్తారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. జిల్లాలోని మాచారెడ్డి మండల పరిధిలోని ప్రజలు కేసీఆర్‌కే ఓట్లే వేస్తామని తీర్మానాలు చేయడం సంతోషంగా ఉందన్నారు.
నకిరేకల్‌లో ఎంపీ కోమటిరెడ్డి వెంటక్‌రెడ్డి కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ టికెట్ ఆశించిన వేముల వీరేశం టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది
సిద్దిపేట జిల్లా రాంపూర్ గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. తాము రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్కు మాత్రమే ఓటు వేస్తామని తీర్మానం చేశారు. ఈ తీర్మాన పత్రాలను మంత్రి హరీష్ రావుకు అందజేశారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను చూసే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు.
కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డికి చెందిన 9 పంచాయతీలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. మాచారెడ్డి మండలంలోని ఉమ్మడి ఎల్లంపేట పరిధిలోని ఈ తొమ్మిది పంచాయతీలు కేసీఆర్ ను గెలిపించుకుంటామని ఏకగ్రీవ తీర్మానాలు చేశాయి.
రానున్న ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని మాజీ పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలకు గాను 12 స్థానాల్లో విజయం సాధిస్తామని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆర్మూర్‌లో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ఆమె.. బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజల్లో ఉండాలని పిలుపునిచ్చారు. పార్టీకోసం కష్టపడ్డవారికి తగిన ప్రాధాన్యత ఉంటుందని సూచించారు.
సీఎం కేసీఆర్ తనకే మూడోసారి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తెలిపారు. మూడోసారి రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. గత 5 ఏళ్లుగా నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసినట్లు ఎమ్మెల్యే వివరించారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నట్లు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి తెలిపారు. ఈ నెల 27న షా రాష్ట్రానికి రానున్నట్లు తెలిపిన ఆయన.. ఖమ్మంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారన్నారు.
గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి షాక్ తగిలింది. ఎమ్మెల్యేగా ఆయనను తెలంగాణ హైకోర్టు అనర్హుడిగా ప్రకటించింది. దీంతో 2018 ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన డీకే ఆరుణను ఎమ్మెల్యేగా ప్రకటించింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీచేసిన డీకే అరుణ 73వేల612 ఓట్లతో సెకండ్ ప్లేస్ లో నిలిచింది. అప్పటి టీఆర్ఎస్, ప్రస్తుత బీఆర్ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి లక్షా 57 ఓట్లు సాధించి గెలుపొందారు.