TS Elections: ఆఖరి పోరాటం.. ఇక మిగిలింది వారం రోజులే!
తెలంగాణలో మరో 9 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రచారానికి వారం రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ పర్యటనకు బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలు రానున్నారు.
తెలంగాణలో మరో 9 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రచారానికి వారం రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ పర్యటనకు బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలు రానున్నారు.
సిరిసిల్ల నియోజకవర్గం ముస్తాబాద్‌లోని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేటీఆర్ కాంగ్రెస్ నేతలకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ నేతలకు 24 గంటలు కనిపించకపోతే ముస్తాబాద్ వచ్చి కరెంటు తీగలు పట్టుకోవాలని కావాలంటే తాను ప్రత్యేకంగా బస్సు ఏర్పాటు చేస్తానంటూ ఛలోక్తులు విసిరారు.
ఈ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు మద్దతు కాంగ్రెస్ పార్టీకే అని కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి. ఈసారి ఆరు గ్యారెంటీలతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ తీపికబురందించారు. రానున్న కాలంలో ఎకరానికి రూ. 16000వేలు ఇస్తామన్నారు. రానున్న రోజుల్లో రైతు బంధు 16వేలు రావాలంటే బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలన్నారు. కొల్లాపూర్ లో ఏర్పాటు చేసిన ప్రజాఆశీర్వాద సభలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల ప్రచారంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ ను మోసం చేస్తే కన్న తల్లిని మోసం చేసినట్లే అని అన్నారు. తెలంగాణను అభివృద్ధి చేసిన మహాత్ముడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు.
ఎంతమంది తమ ప్రభుత్వంపై ఏడ్చినా.. మళ్లీ గెలిచేది తామేనని బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్‌లలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ పాల్గొన్నారు. , 58 ఏళ్ల పాటు ఏడిపించిన కాంగ్రెస్ ను మరోసారి ఓడించాలన్నారు.
కరీంనగర్ బీఆర్ఎస్ ప్రజాశీర్వాద సభలో కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు సీఎం కేసీఆర్. తెలంగాణను ఆంధ్రలో కలిపింది కాంగ్రెస్ అని అన్నారు. ఉద్యమకారులను కాల్చి చంపింది, లక్షల మందిని జైల్లో వేసింది కాంగ్రెస్ పార్టీ అని ఫైర్ అయ్యారు.
తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ నిన్న కొంగరగిద్ద గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే.. ఆ సమయంలో తనకు హారతితో స్వాగతం పలికిన మహిళలకు మంత్రి రూ.4 వేలు కానుకగా అందించారు. దీంతో ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ ఫిర్యాదుతో గూడూరు పీఎస్ లో కేసు నమోదు చేశారు పోలీసులు.
నకిరేకల్, పినపాక, కొల్లాపూర్, ఇల్లందు, పాలేరు, సత్తుపల్లి, భూపాలపల్లి, కొత్తగూడెం నియోజకవర్గాల్లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఆయా స్థానాల్లో గతేడాది పోటీ చేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులే ఈ సారి మళ్లీ తలపడుతుండగా.. వారి పార్టీలే మారిపోయాయి.