BRS: కేసీఆర్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి సిట్టింగ్ ఎంపీ
కవిత అరెస్టై 24 గంటల కాకముందే కేసీఆర్ కు మరో షాక్ తగిలింది. మరో ఎంపీ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు.
కవిత అరెస్టై 24 గంటల కాకముందే కేసీఆర్ కు మరో షాక్ తగిలింది. మరో ఎంపీ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు.
బీఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత్రి మాయావతికి పంపించారు. ఈ క్రమంలో ఆయన బీఆర్ఎస్లో చేరనున్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా నాగర్ కర్నూల్ నుంచి పోటీ చేయనున్నట్లు సమాచారం.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని బీజేపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. లిక్కర్ కేసుతో కవితకు సంబంధం ఉందో లేదో ఇప్పటికైన బయటపెట్టాలన్నారు. నేరం చేయకపోతే ఆమెకు భయమేందుకని, తప్పు చేస్తే శిక్ష తప్పదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్టును ఖండించిన బీఎస్పీ చీఫ్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. 'అయ్యా ప్రవీణ్ సార్.. ఇన్నాళ్లు వారి స్కామ్‌లను బయపెట్టి ఇప్పుడు మాట మారుస్తున్నారా! మీరు ఎవరిని మోసం చేస్తున్నారు సార్? ప్రజలు మూర్ఖులు కాదు' అంటూ పాత పోస్టులు షేర్ చేస్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలేలా ఉంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఈరోజు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. దీంతో ఆయన త్వరలో పార్టీ మారుతారని చర్చ రాష్ట్ర రాజకీయాల్లో మొదలైంది. మాజీమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా బీఆర్ఎస్కు రాజీనామా చేయనున్నట్లు సమాచారం.
పొత్తులో భాగంగా నాగర్ కర్నూల్, హైదరాబాద్ పార్లమెంటు స్థానాలను బీఎస్పీకి కేటాయించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. బీఎస్పీ నుంచి నాగర్ కర్నూల్ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ పోటీ చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ ఓడిపోయిన విషయం తెలిసిందే.
గొర్రెల పంపిణీ స్కాం కేసులో మరో ఇద్దరు అధికారులను అరెస్ట్ చేసింది ఏసీబీ. రంగారెడ్డి జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ డా. కృష్ణయ్య, జాయింట్ డైరెక్టర్ అంజిలప్ప గొర్రెల పంపిణీలో అక్రమాలు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇప్పటికే ఈ కేసులో నలుగురు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.
డీకే శివకుమార్‌ను కలవడంపై మాజీ మంత్రి మల్లారెడ్డి వివరణ ఇచ్చారు. వ్యాపార విషయంపై డీకేను కలిసినట్లు తెలిపారు. తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని అన్నారు. తన వయసు ఇప్పుడు 71 ఏళ్లని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని తేల్చి చెప్పారు.
ఎంపీ రంజిత్ రెడ్డి విముఖత వ్యక్తం చేయడంతో చేవెళ్ల ఎంపీ టికెట్‌ను కాసాని జ్ఞానేశ్వర్‌కు కేటాయించారు కేసీఆర్. అయితే... ఇప్పటి వరకు చేవేళ్ల అభ్యర్థిని కాంగ్రెస్ ప్రకటించకపోవడంతో త్వరలో ఎంపీ రంజిత్ రెడ్డి గులాబీ కండువా తీసేసి మూడు రంగుల జెండా కప్పుకొనున్నట్లు తెలుస్తోంది.