TS: గాడిద దొంగతనం చేశానని కేసు.. బీఆర్ఎస్ ను వదిలిపెట్టం: బల్మూర్ వెంకట్
బీఆర్ఎస్ సోషల్ మీడియా సభ్యులు సీఎం రేవంత్ రెడ్డిపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ మండిపడ్డారు. అనవసరంగా తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. పక్కా ఆధారాలు తీసుకొని అమరవీరుల స్థూపం వద్దకు రావాలని క్రిశాంక్ కు సవాల్ విసిరారు.