MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత ఫోన్ హ్యాక్!
ఎమ్మెల్సీ కవిత ఫోన్ హ్యాక్ అయింది. తన సోషల్ మీడియా ఖాతాలు ఎవరో హ్యాక్ చేశారంటూ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేశారు కవిత.
ఎమ్మెల్సీ కవిత ఫోన్ హ్యాక్ అయింది. తన సోషల్ మీడియా ఖాతాలు ఎవరో హ్యాక్ చేశారంటూ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేశారు కవిత.
బీఆర్ఎస్ పార్టీ ప్రవేశ పెట్టిన దళితబంధు పథకాన్ని రద్దు చేయొద్దని అన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. కావాలంటే ఆ పథకం పేరు మార్చండి.. రద్దు చేసి దళితుల నోట్లో మట్టి కొట్టొద్దు అని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రెండవ విడత లబ్ధిదారులకు దళిత బంధును కొనసాగించాలని కోరారు.
కోలుకుంటున్న కేసీఆర్ త్వరలో ప్రజల ముందుకు రానున్నారు. ఫిబ్రవరి 20వ తేదీన ఎన్నికల ఫలితాల తరువాత తొలిసారిగా కేసీఆర్ గజ్వేల్ లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఎంపీ ఎన్నికలే టార్గెట్ గా వరంగల్ లో కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజలు ఊరుకుంటారా? అని హరీష్ రావు అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు 24 గంటల కరెంట్ తెచ్చింది కేసీఆరే అని అన్నారు.
తెలంగాణ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. చేసిన అభివృద్ధి పనులు ప్రచారం చేసుకోకపోవడం వల్లే ఓడిపోయామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అత్యధిక ఉద్యోగావకాశాలు కల్పించామని,పెన్షన్లు పెంచమని, 6 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు ఇచ్చామని అన్నారు.
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పెన్షన్ల ఊసే ఎత్తడం లేదని చురకలు అంటించారు ఎమ్మెల్సీ కవిత. జనవరి ఒకటో తేది నుంచి రూ.4వేలు ఇస్తా అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏమైందని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలన్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధికారంలో ఉండటం కన్నా ప్రతిపక్షంలో ఉండటమే కాంగ్రెస్కు ప్రమాదం అని కేటీఆర్ అన్నారు. సీఎం అనే రెండక్షరాల కన్నా కేసీఆర్ అనే మూడు అక్షరాలే పవర్ ఫుల్ అని పేర్కొన్నారు. ఫిబ్రవరిలో కేసీఆర్ ప్రజల మధ్యకు వస్తారని తెలిపారు.
ఫార్ములా ఈ-రేస్ రద్దుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రేసు నిర్వహించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి నష్టమే తప్ప లాభం లేదని అన్నారు. BRS నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ కోలుకుంటున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. వచ్చే నెల నుంచి కేసీఆర్ జిల్లాల పర్యటన చేపడుతారని తెలిపారు. ఎన్నికల్లో ఓటమి బీఆర్ఎస్కు స్పీడ్ బ్రేకర్ లాంటిదని అన్నారు. కార్యకర్తలు ఎవరు అధైర్య పడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.