Malla Reddy : త్వరలోనే సీఎం రేవంత్‌ని కలుస్తా.. మల్లారెడ్డి కీలక ప్రకటన.. కాంగ్రెస్‌లోకి జంప్?
మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోతుందని అనుకోలేదని.. ఇంకా ఆ షాక్ నుంచి కోలుకోలేదని అన్నారు. త్వరలో సీఎం రేవంత్ ను కలుస్తానని.. గతంలో ఇద్దరం టీడీపీలోనే ఉన్నామని పేర్కొన్నారు. దీంతో మల్లారెడ్డి కాంగ్రెస్‌లో చేరుతారనే చర్చ జోరందుకుంది.