Pawan Kalyan: దళిత సీఎం ఎక్కడా?.. పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు!
సీఎం కేసీఆర్ పై పరోక్షంగా విమర్శలు చేశారు జనసేన ఛీఫ్ పవన్ కళ్యాణ్. నాడు తెలంగాణకు మద్దతు ఇచ్చినవారిలో తాను ఒకడిని అని తెలిపారు. తెలంగాణలో దళిత ముఖ్యమంత్రిని చూడలేకపోయాం అని అన్నారు.
సీఎం కేసీఆర్ పై పరోక్షంగా విమర్శలు చేశారు జనసేన ఛీఫ్ పవన్ కళ్యాణ్. నాడు తెలంగాణకు మద్దతు ఇచ్చినవారిలో తాను ఒకడిని అని తెలిపారు. తెలంగాణలో దళిత ముఖ్యమంత్రిని చూడలేకపోయాం అని అన్నారు.
తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ఫలితాలను సాధించడమే లక్ష్యంగా పీఎం మోదీ ఈ నెల 25, 26, 27 తేదీల్లో పర్యటించనున్నారు. పార్టీకి గట్టి పట్టు ఉన్న దుబ్బాక, కరీంనగర్, మహబూబాబాద్, నిర్మల్, హైదరాబాద్, రంగారెడ్డి ప్రాంతాల్లో ప్రధాని పర్యటన ఉండేలా ప్లాన్ చేసింది బీజేపీ.
తెలంగాణ ఉద్యమకారుడు, ఆర్టీసీ యూనియన్ మాజీ నేత అశ్వత్థామ రెడ్డి బీజేపీకి గుడ్ బై చెప్పారు. వనపర్తి టికెట్ ను తొలుత అశ్వత్థామ రెడ్డికి ప్రకటించిన బీజేపీ తర్వాత వేరే వారికి కేటయించింది. దీంతో ఆయన అసంతృప్తితో ఉన్నారు.
తెలంగాణలో మరో 9 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రచారానికి వారం రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ పర్యటనకు బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలు రానున్నారు.
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు చేశారు. తెలంగాణ ప్రజలు బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
మోటార్లకు మీటర్లు పెట్టనందుకే తెలంగాణ ప్రభుత్వానికి అదనపు రుణాలు ఇవ్వలేదంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వ్యాఖ్యలను బీఆర్ఎస్ అస్త్రంగా మార్చుకునే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది.
తన కుమారుడు ఉదయ్ బాబుమోహన్ బీజేపీని వీడి బీఆర్ఎస్ లో చేరడంపై తనకు సమాచారం లేదన్నారు బాబుమోహన్. పదిహేను రోజులుగా తన కుమారిడిని చూడలేదన్నారు. ఫోన్ చేస్తే ఎత్తడం లేదన్నారు. గతంలో తాను చేసిన అభివృద్ధిని చూసి అందోలు ప్రజలు తనను గెలిపిస్తారన్న నమ్మకం ఉందన్నారు.
సర్వేలను చిత్తు చేస్తూ డిసెంబర్ 3న బీజేపీ గెలవబోతుందని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ మేనిఫెస్టోపై ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారన్నారు. బీసీ ముఖ్యమంత్రి హామీ ప్రజలను ఆకర్షిస్తోందన్నారు కిషన్ రెడ్డి.
బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత బూరనర్సయ్య గౌడ్. బూతు స్థాయి నుంచి పీఎం వరకు ప్రచారంలో దూసుకుపోతున్నారని తెలిపారు. బీసీని సీఎం చేస్తామని చెప్పినప్పటి బీజేపీ గ్రాఫ్ భారీ స్థాయిలో పెరుగుతుందన్నారు.