ఆ ఐదు నెలలు ఎంతో కష్టంగా గడిచాయి: బిపాషా!
బాలీవుడ్ ముద్దుగుమ్మ బిపాషా బసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన టక్కరి దొంగలో నటించి అలరించింది. ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ ఆ తరువాత సినిమాలు చేయలేదు. టక్కరి దొంగ పెద్దగా హిట్ అవ్వకపోవడంతో నిర్మాతలు కూడా ఆమెను తీసుకోవడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. దాంతో ఆమె బాలీవుడ్ కే పరిమితం అయ్యింది.