ఎయిర్‌షో చూసేందుకు వెళ్లారు..అయితే అక్కడ ఏం జరిగిందో తెలుసా..!!
భారత వైమానిక దళం యొక్క ఎయిర్‌షో సందర్భంగా భోపాల్‌లోని ఖాను గ్రామంలో ప్రమాదం జరిగింది. ప్రదర్శనను చూడటానికి స్ధానిక ప్రజలు ఎంతో ఆసక్తితో తరలి వచ్చారు. అయితే, కొందరు యువకులు అతి ఉత్సహంతో ఎయిర్ షో చూసేందుకు అక్కడే ఉన్న ఓ రేకుల షెడ్‌పైకి ఎక్కారు. అంతా ఆసక్తిగా ఎయిర్ షో చూస్తున్న సమయంలో ఆ రేకుల షెడ్ ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో అక్కడున్న వారంతా షాక్ కు అయ్యారు.