Bhajan Lal Sharma: తొలి విజయంతోనే సీఎం.. భజన్‌లాల్ కెరీర్లో ఆసక్తికర విశేషాలు
రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అధిష్టానం ఖరారు చేసిన భజన్‌లాల్ శర్మ విద్యార్థి నేత నుంచి క్రమంగా ఎదిగారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆయనకు ఉంది. రాష్ట్రంలో ఎక్కువ కాలం పార్టీ ప్రధానకార్యదర్శిగా సేవలందించారు. ఆర్ఎస్ఎస్ లో క్రియాశీలకంగా వ్యవహరించారు.