Mango Price : రికార్డు ధర పలుకుతున్న ఉలవపాడు బంగినపల్లి మామిడి!
ఏపీలోని ఉలవపాడు బంగినపల్లి మామిడికి మంచి గిరాకీ ఉంది. గతంలో ఎన్నడూ లేనంతగా తొలిసారి టన్ను ఏకంగా రూ.90 వేలు పలకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.కాపు తక్కువగా ఉండటం, నాణ్యమైన కాయ దిగుబడి రావడంతో ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు కొనుగోలుకు ఎగబడుతున్నారు.