Ram Mandir : రామాలయ గర్భగుడి ఫొటో ఇదే.. ఎంత అద్భుతంగా ఉందో చూడండి!
హిందూజీవన విధానంలో మమేకమైన ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు. అయోధ్య రామాలయ గర్భగుడికి చెందిన అద్భుతమైన చిత్రాన్ని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ షేర్ చేశారు.
హిందూజీవన విధానంలో మమేకమైన ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు. అయోధ్య రామాలయ గర్భగుడికి చెందిన అద్భుతమైన చిత్రాన్ని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ షేర్ చేశారు.
శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రకటించిన అర్చకుల ఖాళీల భర్తీ ప్రకటనకు భారీగా స్పందన వచ్చింది. 3వేల మంది అభ్యర్థులు పూజారి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులో 200 మందిని ఇంటర్వ్యూ కోసం మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసినట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి.
అయోధ్య నిర్మిస్తున్న రామ మందిరం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రామ మందిరం గ్రౌండ్ ఫ్లోర్ పూర్తిగా సిద్ధమైంది. గర్భగుడి నిర్మాణ పనులు కూడా పూర్తయ్యాయని చెబుతున్నారు. నిర్మాణంలో ఉన్న రామ మందిరానికి సంబంధించిన అనేక ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ అవుతున్నాయి.
సూపర్ స్టార్ రజనీ కాంత్ అయోధ్య(ayodhya)లో రాముల వారిని దర్శించుకున్నారు. అయోధ్య దర్శనంతో తన చిరకాల వాంఛ నెరవేరిందన్నారు. ఆయోధ్య దర్శనం అత్యద్బుతమన్నారు. రాష్ట్రంలో పలువురు ప్రముఖులో సమావేశం కావడం చాలా సంతోషంగా అనిపించిందని పేర్కొన్నారు. దేవుని అనుగ్రహం వుంటే ఆలయ నిర్మాణం వుంటే మళ్లీ అయోధ్యకు వస్తానన్నారు.
సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో ఉన్నారు. తొలుత యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో భేటీ అనంతరం ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌తో సమావేశం అయ్యారు. ఆ తర్వాత అయోధ్య చేరుకుని హనుమాన్ గర్హిని దర్శించుకున్నారు.
జనవరి 16 నుంచి 24 మధ్య ఒక శుభ ముహూర్తంలో ఆలయ కింది అంతస్తులో నిర్మించిన గర్భగుడిలో శ్రీరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని చంపత్ రాయ్ తెలిపారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర న్యాస్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఆదివారం నిరంజనీ అఖారాకు చేరుకుని అఖిల భారతీయ అఖారా పరిషత్ (నిరంజని) అధ్యక్షుడు శ్రీమహంత్ రవీంద్రపురి మహరాజ్‌ను కలిసిన అనంతరం ఈ ప్రకటన చేశారు.
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ యూపీ ప్రతిపక్ష నేత, సమాజ్ వాది పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ తో భేటీ అయ్యారు. రజనీకాంత్‌తో భేటీ గురించి ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ట్వీట్ చేశారు. తాను మైసూర్లో ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లో సూపర్ స్టార్ రజనీకాంత్‌ని తెరపై చూశానన్నారు. అప్పుడు కలిగిన ఆనందం ఇప్పటికీ చెక్కుచెదరలేదని ఎమోషనల్ అయ్యారు.