AP Politics: డీల్ డన్.. ఏపీలో బీజేపీ ఎన్ని స్థానాల్లో పోటి చేస్తుందంటే?
బీజేపీతో టీడీపీ, జనసేన సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. బీజేపీని 5 ఎంపీ, 9 ఎమ్మెల్యే సీట్లలో పోటికి దింపాలని కూటమి పెద్దలు ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. సీట్ల ఒప్పందంపై త్వరలోనే బీజేపీ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది.