Lokesh: 'అయ్యో జగన్'.. అంటూ సీఎం జగన్ పై లోకేష్ చురకలు
సీఎం జగన్ పై చురకలు అంటించారు టీడీపీ నేత లోకేష్. ఆయన మాటలు మాత్రమే కోటలు దాటుతాయి, పనులు గడపదాటవు అంటూ విమర్శలు చేశారు. కడప స్టీల్ ప్లాంట్ పనులు అంగుళం కూడా ముందుకు సాగలేదని అన్నారు.
సీఎం జగన్ పై చురకలు అంటించారు టీడీపీ నేత లోకేష్. ఆయన మాటలు మాత్రమే కోటలు దాటుతాయి, పనులు గడపదాటవు అంటూ విమర్శలు చేశారు. కడప స్టీల్ ప్లాంట్ పనులు అంగుళం కూడా ముందుకు సాగలేదని అన్నారు.
ఏపీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు నుంచి రెండు రోజుల పాటు ఈసీ బృందం అధికారులు ఏపీలో పర్యటించనున్నారు.
తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో ఓ గ్యాస్ సిలిండర్ పేలిన సంఘటనలో తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ ప్రమాదం కారణంగా 15 కుటుంబాలు నివాసాలు కోల్పోవాల్సి వచ్చింది. భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని స్థానికులు చెప్తున్నారు.
సీఎం జగన్ కు ఓటమి భయం పట్టుకుందని అన్నారు టీడీపీ నేత అచ్చెన్నాయుడు. యువగళం విజయోత్సవ సభను అడ్డుకునేందుకు వైసీపీ ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసిందని మండిపడ్డారు. ఎవరు ఊహించని రీతిలో జనాలు సభకు వచ్చారని హర్షం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూల్ విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్ లు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు సీఎం జగన్. దీని ద్వారా 4 లక్షల 34 వేల మంది 8వ తరగతి విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. అనంతరం సీఎం జగన్ బహిరంగ సభలో పాల్గొంటారు.
ఆరోగ్యశ్రీ స్మార్ట్‌కార్డుల పంపిణీని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది జగన్ సర్కార్. మొత్తం 1.48 కోట్ల స్మార్ట్‌కార్డులను వైద్యశాఖ ముద్రించింది. ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యఖర్చుల పరిమితిని రూ.25 లక్షలకు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే.
టీడీపీపై నిప్పులు చెరిగారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. దొంగ ఓట్ల పేరుతో టీడీపీ కొత్త బిజినెస్ చేస్తుందని ఆరోపించారు. తప్పుడు ఫిర్యాదులతో ఎన్నికల కమిషన్ సమయాన్ని టీడీపీ వృధా చేస్తుందని పేర్కొన్నారు. ఒక యాప్ తో ఓటర్ల డేటాను టీడీపీ కొల్లగొడుతుందని అన్నారు.
ఏపీ విద్యార్థులకు సీఎం జగన్ తీపి కబురు అందించారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు జగనన్న విదేశీ విద్యా దీవెన నిధులను తాడేపల్లి క్యాంపు నుంచి నేరుగా వారి ఖాతాల్లో సీఎం జగన్ బటన్ నొక్కి జమ చేయనున్నారు.
జగన్ సర్కార్ పై సెటైర్లు వేశారు ఏపీ బీజేపీ ఛీఫ్ పురంధేశ్వరి. వైసీపీ ప్రభుత్వం స్టిక్కర్ ప్రభుత్వం అని అన్నారు. వైసీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్లను తాకట్టు పెట్టి 124 కోట్లు అప్పు తీసుకుందని ఆరోపించారు. ఐటీ పరిశ్రమను పూర్తిగా ధిగజార్చారని మండిపడ్డారు.