AP: నెల్లూరులో ఘనంగా రొట్టెల పండుగ.. 3 లక్షల మందికి..!
నెల్లూరులో రొట్టెల పండుగ ప్రారంభమైంది. బారాషాహిద్ దర్గా రొట్టెల పండుగకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పోటెత్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. 18వందల మంది పోలీసులతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.