AP High Court: మాజీ మంత్రి నారాయణకు ఏపీ హైకోర్టులో స్వల్ప ఊరట
మాజీ మంత్రి నారాయణకు ఏపీ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. రాజధాని అమరావతి అసైన్ భూముల కేసులకు సంబంధించి ముందస్తు బెయిల్ ను మరో రెండు వారాలు పొడిగించింది ఏపీ హైకోర్టు. నారాయణ దాఖలు చేసిన మరో నాలుగు బెయిల్ పిటిషన్లను హైకోర్టు వాయిదా వేసింది. ఆ పిటిషన్ల విచారణను ఈనెల 16వ తేదీకి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో బెయిల్, క్వాష్ పిటిషన్ వాయిదా పడ్డాయి. అసైన్ ల్యాండ్స్ కేసులో క్వాష్, బెయిల్ పిటిషన్లను సైతం వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.