Chandrababu Case Updates: స్కిల్ డవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు మరో షాక్ ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. స్కిల్ డవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు బెయిల్ కోరుతూ ఆయన న్యాయవాదులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ విచారణకు హైకోర్టు నిరాకరిచింది. By Nikhil 10 Oct 2023 in ఆంధ్రప్రదేశ్ New Update షేర్ చేయండి ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు (Chandrababu) మరో షాక్ తగిలింది. స్కిల్ డవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు బెయిల్ కోరుతూ ఆయన న్యాయవాదులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ విచారణకు హైకోర్టు (AP high Court) నిరాకరిచింది. బెయిల్ పిటిషన్ ను నిన్న హైకోర్టు కొట్టివేయంతో ఆయన లాయర్లు ఈ రోజు హైకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబుకు హైకోర్టులోనూ ఊరట లభించకపోవడంతో టీడీపీ శ్రేణుల్లో తీవ్ర నిరాశ వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ సాగుతోంది. క్వాష్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేస్తే.. సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి నారా లోకేష్ ఈ రోజు సీఐడీ విచారణకు హాజరయ్యారు. విచారణ తర్వాత సీఐడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై కూడా ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠగా మారింది. ఇది కూడా చదవండి: Nara Lokesh: నారా లోకేష్ సీఐడీ విచారణకు లంచ్ బ్రేక్.. మూడు గంటల పాటు అడిగిన ప్రశ్నలివే! ఇదిలా ఉంటే.. చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో వరుసగా రెండో రోజు వాదనలు కొనసాగుతున్నాయి. ఇరు వర్గాల లాయర్లు 17 ఏ సెక్షన్ చుట్టే తమ వాదనలు వినిపిస్తున్నారు. ఈ కేసుకు 17 ఏ వర్తించదని సీఐడీ న్యాయవాది వాదిస్తున్నారు. అయితే 17ఏ వర్తిస్తుందని చంద్రబాబు తరఫు లాయర్లు బలంగా వాదనలు వినిపిస్తున్నారు. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై తీవ్ర ఉత్కంఠగా మారింది. మరో వైపు.. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో (AP CID IRR Case) దర్యాప్తు అధికారి మార్పు చేసింది సీఐడీ (CID). ప్రస్తుతం ఉన్న ఏఏస్పీ జయరాజు స్థానంలో డీఎస్పీ విజయ భాస్కర్ కు బాధ్యతలు అప్పగించింది. ఇందుకు సంబంధించి ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖల్ చేసింది. జయరాజుకు పని భారం ఎక్కువగా ఉండటంతో దర్యాప్తు అధికారిని మార్పు చేసినట్లు పిటిషన్ లో సీఐడీ (CID) పేర్కొంది. #ap-high-court #chandrababu-arrest మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి