Vizag: విశాఖలో గుప్తు నిధుల తవ్వకాలు..!
విశాఖ నగరం నడిబొడ్డులో గుప్తనిధుల తవ్వకాలు కలకలం రేపాయి. కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో.. తాటిచెట్ల పాలెం రైల్వే క్వార్టర్స్‌లో ఇంటి ఆవరణంలో రైల్వే ఉద్యోగి ఆధ్వర్యంలో పూజలు చేసి 20 అడుగుల గొయ్యి తవ్వేశారు.
విశాఖ నగరం నడిబొడ్డులో గుప్తనిధుల తవ్వకాలు కలకలం రేపాయి. కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో.. తాటిచెట్ల పాలెం రైల్వే క్వార్టర్స్‌లో ఇంటి ఆవరణంలో రైల్వే ఉద్యోగి ఆధ్వర్యంలో పూజలు చేసి 20 అడుగుల గొయ్యి తవ్వేశారు.
పాత పింఛను విధానాన్ని పునరుద్ధరిస్తామన్న హామీని జగన్ ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోయిందంటూ ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు బలవన్మరణానికి ప్రయత్నించారు. ఉపాధ్యాయులపై ప్రభుత్వం అనుచితంగా వ్యవహరిస్తోందంటూ ఐదు పేజీల లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆయన ఆత్మహత్యకు యత్నించారు.
కాకినాడలో శ్రీకిరణ్ అనే యువ వైద్యుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. తన వద్ద నుంచి భూమి పత్రాలు తీసుకున్న స్థానిక రాజకీయ నాయకుడి సోదరుడు డబ్బులు చెల్లించకుండా వేధించడమే ఇందుకు కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
స్కూల్ విద్యార్థినికే తాళి కట్టి పెళ్లి అయ్యిందంటూ అత్యాచారం చేసిన ఉపాధ్యాయుడు సస్పెండ్ అయ్యాడు. ఈ దారుణమైన ఘటన పశ్చిమగోదావరి యండగండిలో చోటుచేసుకుంది. అయితే, ఇంతకు ముందే సోమరాజుకు పెళ్లి అయింది. కాగా, కుటుంబ కలహాలతో భార్య, పిల్లలకు దూరంగా ఉంటున్నాడు.
చిత్తూరు జిల్లా మదనపల్లిలో దారుణం జరిగింది. ప్రియుడు గగన్తో కలిసి భర్త వెంకట శివను భార్య రమణమ్మ హత్య చేసింది. ఏడాదిగా రమణమ్మ గగన్ అనే యువకుడితో పాటు బషీర్ అనే మరో వ్యక్తితో సహజీవనం చేస్తోంది. గగన్తో కలిసి రమణమ్మ తన ఇంట్లోనే ఉండడాన్ని చూసి ఆగ్రహించాడు వెంకటశివ. దీంతో అతడిని రోకలిబండతో కొట్టి చంపేశారు.