తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్..నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని హామీ
తిరుపతి జిల్లాలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన పర్యటించారు. బాధితులను పరామర్శించిన జగన్ నష్టపోయిన ప్రతి రైతును అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వారం రోజుల్లో అందరికి సాయం చేస్తామని స్పష్టం చేశారు. ప్రతి ఇంటికి రూ. 2500 ఇస్తామని పేర్కొన్నారు.