BJP Purandeswari: 'ఆడుదాం ఆంధ్ర ఎమో గానీ ఆంధ్రాతో ఆడుకుంటున్నారు'
అధికార పార్టీ వైసీపీపై ఏపీ బీజేపీ అధ్యక్షరాలు పురందేశ్వరి కౌంటర్లు వేశారు. వైసీపీ కొత్తగా పెట్టిన ఆడుదాం ఆంధ్ర ఎమో గానీ ఆంధ్రాతో ఆడుకుంటున్నారని సెటైర్లు వేశారు.
అధికార పార్టీ వైసీపీపై ఏపీ బీజేపీ అధ్యక్షరాలు పురందేశ్వరి కౌంటర్లు వేశారు. వైసీపీ కొత్తగా పెట్టిన ఆడుదాం ఆంధ్ర ఎమో గానీ ఆంధ్రాతో ఆడుకుంటున్నారని సెటైర్లు వేశారు.
రానున్న ఎన్నికల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ని ఓడించేది నేనే అని ధీమ వ్యక్తం చేశారు మంగళగిరి వైసీపీ ఇన్చార్జి గంజి చిరంజీవి. నారా లోకేష్ నాన్ లోకల్.. గంజి చిరంజీవి లోకల్ అని సిని స్టైల్లో వ్యాఖ్యనించారు.
మచిలీపట్నంలో పేర్నినానిపై మాజీ మంత్రి కొల్లు రవీంద్ర షాకింగ్ కామెంట్స్ చేశారు. గోతికాడ నక్కలా ఉండి దొంగగా వ్యాక్సిన్లు అమ్ముకున్న చరిత్ర దాస్తే దాగేది కాదన్నారు. శవాల మీద పేలాలు ఏరుకునే వాళ్ళకి అభివృద్ధి ఎలా తెలుస్తుంది అని ధ్వజమెత్తారు.
ఏపీలో ఈ నెల 19న నంద్యాలలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ ప్రకటనలో పేర్కొంది. ఈ జాబ్ మేళా ద్వారా వివిధ ప్రైవేట్ సంస్థల్లో మొత్తం 750 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో అంగన్వాడీల ఆందోళన 5వ రోజు కొనసాగింది. ఈ కార్యక్రమానికి మద్దతూ తెలిపి దీక్షలో పాల్గొన్నారు టీడీపీ మహిళ నాయకురాలు వంగలపూడి అనిత. ఉల్లి గడ్డకు, ఆలు గడ్డకు తేడా తెలియని జగన్ కు అంగన్వాడీల కష్టాలు ఎలా తెలుస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ ప్రభుత్వంపై అసంతృప్తితో కామెంట్స్ చేసినట్లు వైరల్ అవుతున్న వీడియోపై క్లారిటీ ఇచ్చారు కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి. 2018లో గత టీడీపీ ప్రభుత్వంపై చేసిన కామెంట్స్‌ను ఇప్పుడు జగన్ ప్రభుత్వంపై చేసినట్లుగా టీడీపీ శ్రేణులు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కృష్ణ జిల్లా భావదేవరపల్లిలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కన్న కొడుకే తండ్రిని అత్యంత కర్కశంగా ఇంట్లో మంచంపైనే చంపి, డీజిల్ పోసి తగులబెట్టాడు. ఆస్థి కోసమే ఇంతటి దారుణానికి తెగించినట్లు తెలుస్తోంది.
కర్నూలు జిల్లాలో హృదయవిదారక దృశ్యం కనిపించింది. చోరీ కేసులో రిమాండ్‌పై ఓ మహళను సబ్ జైలుకు తరలించారు. తల్లి ఎందుకు జైలుకు వెళ్లిందో తెలియని ఆ చిన్నారి అమ్మని చూడాలంటూ జైలు ముందు గుక్కపట్టి ఏడ్చింది. ఈ ఘటనను చూసిన స్థానికులు చిన్నారిని చూసి కంటతడి పెట్టుకుంటున్నారు.