Anantapuram TDP : 'తెలుగుదేశం పార్టీ అమ్ముడుపోయింది..' అనంతపురంలో టీడీపీ ఆఫీస్‌కు నిప్పు!
అనంతపురం టీడీపీలో అసంతృప్తి భగ్గుమన్నది. టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అనుచరులు టీడీపీ కార్యాయంలో బీభత్సం సృష్టించారు. కార్యాలయ ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. టీడీపీ డబ్బులకు అమ్ముడుపోయిందని ప్రభాకర్ చౌదరి ఫైర్ అయ్యారు.