WhatsApp: వాట్సాప్ యూజర్లకు బంపర్ న్యూస్.. త్వరలోనే ఏఐ స్టిక్కర్లు!
వాట్సాప్ మరో కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం ప్రపంచమంతా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ జపం చేస్తుండడంతో వినియోగదారులకు 'ఏఐ' స్టిక్కర్ ట్రీట్ ఇవ్వనుంది. 'ఏఐ'తో స్టిక్కర్లను అందించడమే ఈ ఫీచర్ స్పెషాలిటీ. ప్రస్తుతానికి చాలా తక్కువ మందికి మాత్రమే రిలీజ్ అయిన ఈ స్పెసిఫికేషన్.. త్వరలోనే మరింత మందికి అందుబాటులోకి రానుంది.