Kota Srinivasa Rao: బ్యాంకు జాబ్ వదిలేసి సినిమాల్లోకి.. కోట శ్రీనివాస్ సినీ ప్రస్థానం ఇదే
తెలుగు సినీ చరిత్రలో తనదైన ముద్ర వేసుకున్న విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు (83) ఇవాళ తుది శ్వాస విడిచారు. 4 దశాబ్దాలకు పైగా సినీ రంగంలో కొనసాగిన ఆయన ప్రస్థానం అద్భుతం. కోట శ్రీనివాసరావు అభినయానికి పెట్టని కోట.. నవరస నటనా సార్వభౌముడు.