Fake Doctors: 50 మంది నకిలీ డాక్టర్లు.. ఇద్దరు అరెస్ట్.!
తెలంగాణ వైద్య మండలి సభ్యులు IDPL, చింతల్, షాపూర్‌నగర్ ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో 50 మంది నకిలీ వైద్యులను గుర్తించారు. 8 మంది సభ్యులు వేర్వేరు బృందాలుగా ఒకేసారి తనిఖీలు జరిపారు. నకిలీ వైద్యులు తమ ఆరోగ్య కేంద్రాల్లో రోగులను చేర్చుకుని యాంటీబయాటిక్స్ ఇస్తున్నట్లు గుర్తించారు.