ఓరి దుర్మార్గుడా.. కుక్క తోకకు పటాకులు కట్టి ఏం చేశాడో చూడండి
దివాళీ వేళ సంతోషంగా గడపాల్సింది పోయి ఓ యువకుడు కనికరం లేని పనిచేశాడు. ఓ కుక్క తోకకు క్రాకర్స్ కట్టి దానికి నిప్పట్టించాడు. దాన్నుంచి నిప్పులు రావడంతో ఆ కుక్క భయంతో పరుగులు తీసింది. ఆ వీడియో వైరల్ కావడంతో యువకుడిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.