New Feature On WhatsApp : ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్(New Features) అందిస్తూ మార్కెట్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది వాట్సాప్(WhatsApp). దీనికి పోటీగా చాలా యాప్స్ వచ్చినప్పటికీ అవేవి మార్కెట్లో వాట్సప్‌కి గట్టి పోటీ ఇవ్వలేకపోయాయి. ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకువస్తోంది. ఇప్పటికే పలు కీలక ఫీచర్లు జోడించిన వాట్సాప్ ఇప్పుడు మరో కొత్త ఫీచర్ వైపు అడుగులు వేస్తోంది.
వాబీటా ఇన్ఫో(WAbetaInfo) నివేదిక ప్రకారం వాట్సాప్ కెమెరాలో జూమ్ కంట్రోల్ ఫీచర్‌ను తేనుంది. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే ఐఓఎస్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఈ జూమ్ ఆప్షన్ ద్వారా ఫోటోలను మరింత స్పష్టంగా తీయగలుగుతారని చెబుతున్నారు. అప్డేట్ వెర్షన్ 24.9.10.75లో కెమెరా జూమ్ ఫీచర్(Camera Zoom Feature) ని యాక్సెస్ చసుకోవచ్చును. యూజర్లు వాట్సాప్‌లో కెమెరాను వినియోగిస్తున్నప్పుడు ఫోటో ఐకాన్ మీద ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అలా చేసినప్పుడు కిందికి, పైకి స్వైప్ చేయడం ద్వారా జూన్ ఇన్, అవుట్ చేసుకోవచ్చును. దీంతో వీడియో రికార్డింగుల్లో, ఫోటోల్లో జూమ్‌ను చక్కగా ట్యూన్ చేయడానికి వీలు కలుగుతుంది.
కొత్త స్టిక్కర్స్ కూడా…
కెమెరాలో చూమ్ ఆప్షన్‌తో పాటూ వాట్పాస్లో త్వరలో కొత్త స్టిక్కర్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఈ స్టిక్కర్లను షార్ట్ కట్లో ఉపయోగించుకునేలా కూడా ఫీచర్‌ను అభివృద్ధి చేయనున్నారు. దాంతో పాటూ స్టిక్కర్ క్రియేట్ చేయడాన్ని ఏఐ నుంచి కూడా వేరు చేయనున్నారు.
Also Read:Social Media : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలు..వాటి మీమ్స్..