YSRCP Third List: మరి కొన్ని నెలల్లో ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు (AP Assembly Elections) జరగనున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అక్కడి అన్ని రాజకీయ పార్టీలు గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని వైసీపీ పార్టీ (YSRCP) సర్వేల ఆధారంగా గెలవలేని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు (YCP MLA’S) టికెట్ కట్ చేస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాల్లో కొత్త వారికి ఛాన్స్ ఇస్తోంది. ఇప్పటికే పలు స్థానాల్లో కొత్త ఇంఛార్జిలను నియమిస్తూ రెండు లిస్టులను వైసీపీ విడుదల చేసింది.
ALSO READ: YS Sharmila: అక్కడి నుంచే షర్మిల పోటీ?
థర్డ్ లిస్ట్ కోసం ఉత్కంఠ..
సీఎం జగన్ (CM Jagan) వచ్చే ఎన్నికల్లో గెలవాలని డిసైడ్ అయ్యారు. అధికారంలో కోల్పోవద్దనే ఆలోచనతో గెలిచే అవకాశం లేని సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తూ.. కొత్త వారికి అవకాశం కల్పిస్తున్నారు జగన్. ఇటీవల మొదటి లిస్ట్, రెండో లిస్టును వైసీపీ విడుదల చేసింది. 2024 ఎన్నికల టీమ్‌పై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. నియోజకవర్గ అభ్యర్థుల మార్పు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా మూడో లిస్ట్ పై రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. మరో రెండు మూడు రోజుల్లో మూడో లిస్ట్ కూడా విడుదల కానున్నట్లు సమాచారం.
జగన్ వద్దకు ఎమ్మెల్యేలు..
అభ్యర్థుల ప్రకటన నేపథ్యంలో సీఎం జగన్ నివాసం ఉంటున్న తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌కు ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డితో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు సీఎంను కలిసే అవకాశం ఉందని సమాచారం. నెల్లూరు, తిరుపతి, విజయనగరం జిల్లాల అభ్యర్థుల మార్పులపై జగన్ ఈ రోజు ఫోకస్ పెట్టనున్నట్లు సమాచారం. 2,3 రోజుల్లో 15 మందితో థర్డ్ లిస్ట్ ను వైసీపీ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మార్పులపై వైసీపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్ నెలకొంది. లిస్ట్‌లో ఎవరి పేరు ఉంటుందోన్న ఉత్కంఠ వారిలో వ్యక్తం అవుతోంది.
ALSO READ: వైసీపీలో భగ్గుమన్న అంతర్గత విభేదాలు.. ఏకంగా సర్పంచ్ తల నరుకుతానంటూ బెదిరింపులు!
వైసీపీ టూ టీడీపీ, జనసేన..
వైసీపీలో రాజీనామాల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల మార్పుపై కొందరు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు సీఎం జగన్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే టికెట్ దక్కని వారు, దక్కే అవకాశం లేని కొందరు నేతలు వైసీపీకి రాజీనామా చేసి జనసేన, టీడీపీలో చేరిపోయారు. మరికొందరు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే, మొదటి లిస్ట్ రాగానే కొందరు, రెండో లిస్టులో పేరు లేని మరి కొందరు నేతలు వైసీపీకి రాజీనామా చేసి వేరే పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మూడో లిస్ట్ వస్తున్న నేపథ్యంలో ఎవరికి టికెట్ వస్తుందని ఉత్కంఠ నెలకొనగా.. ఎవరు పార్టీకి రాజీనామా చేస్తారు? అనే దానిపై కూడా రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరగుతుంది. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే!