Pawan Kalyan: మైనర్ అయిన తమ కుమార్తె కనిపించడం లేదని కొద్దిరోజుల క్రితం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కి పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన శివ కుమారి అనే మహిళ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై ఫిర్యాదు చేసినా 9 నెలలుగా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆమె డిప్యూటీ సీఎం ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ స్వయంగా సీఐకి ఫోన్ చేసి మాట్లాడారు. కేసును త్వరగా ఛేదించాలని ఆదేశించారు. తన వాహనంలోనే ఆ బాధిత మహిళను పోలీస్ స్టేషన్ కు పంపించారు.
ఈ వార్త ఆ సమయంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ యువతి జమ్మూలో ఉందని గుర్తించారు. ఆ యువతి విజయవాడ రామవరప్పాడుకు చెందిన యువకుడితో కలిసి జమ్మూకు పారిపోయినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో అక్కడి పోలీసులతో ఏపీ పోలీసులు మాట్లాడి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.
ఏపీ నుంచి వెళ్లిన స్పెషల్ పోలీస్ టీం వారిని విజయవాడకు తీసుకుని వస్తున్నారు. దాదాపు 9 నెలల తరువాత యువతి ఆచూకీ లభ్యం అయ్యింది. పవన్ ఆదేశాలతో ఈ కేసు పై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టి ఆ యువతిని పట్టుకున్నారు. దీంతో బాధిత కుటుంబంలో హర్షం వ్యక్తం అవుతోంది.
#JanaVaani #PawanKalyanAneNenu
మిస్సింగ్ కేసు పై స్వయంగా రంగంలోకి దిగిన ఉప ముఖ్యమంత్రి
విజయవాడలో చదువుకుంటున్న తన కుమార్తె మైనర్ అనీ… ఆమెను ప్రేమ పేరిట ట్రాప్ చేసి కిడ్నాప్ చేశారని, గత తొమ్మిది నెలలుగా ఆమె జాడ తెలియడం లేదని భీమవరం నుంచి వచ్చిన శివకుమారి అనే బాధితురాలు ఉప… pic.twitter.com/NNMZtUOQuC
— JanaSena Party (@JanaSenaParty) June 22, 2024
Also read: పుణెలో జికా వైరస్ కలకలం.. ఇద్దరు గర్భవతులకు పాజిటివ్!